MLC Kavitha Case: ఇది అక్రమ కేసు.. న్యాయపరంగా పోరాడుతున్నా: ఎమ్మెల్సీ కవిత

రిమాండ్ ముగియడంతో ఈ రోజు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఇది అక్రమ కేసు అని.. రాజకీయ కుట్రతో పెట్టినదని అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు.

New Update
MLC Kavitha Case: ఇది అక్రమ కేసు.. న్యాయపరంగా పోరాడుతున్నా: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha Reaction On Delhi Liquor Scam Case: డిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఈ రోజు ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచింది. అయితే.. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఇది అక్రమ కేసు అని అన్నారు. రాజకీయ కుట్రతోనే తనపై కేసు పెట్టారన్నారు. దీనిపై న్యాయపరంగా పోరాడుతున్నట్లు చెప్పారు. గత ఏడాది అడిగిన ప్రశ్నలనే విచారణలో మళ్లీ అడిగారన్నారు. మరో వైపు కవితను మరో 5 రోజులు విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. ఇరు వర్గాల మధ్య వాదనలు జరగగా కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కవిత తన పిల్లలతో మాట్లాడేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. తనకు హైబీపీ ఉందని.. తన మెడికల్ రిపోర్టులు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లోని కవిత ఆడపడుచు నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కవిత కస్టడీ పొడిగిస్తే ఈ ఇద్దరిని కలిపి ఈడీ విచారించే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

హరీష్ రావు తండ్రికి అనారోగ్యం.. AIG ఆస్పత్రిలో చేరిక!

బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తదితరులు ఈ రోజు సత్యనారాయణ రావును పరామర్శించారు.

New Update
BRS MLA Harish Rao

BRS MLA Harish Rao

బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 

బీఆర్ఎస్ నేతల పరామర్శ..

విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి సత్యనాయణరావును పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పరామర్శించిన వారిలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తదితరులు ఉన్నారు.

(BRS Harish Rao | telugu-news | telugu breaking news )

Advertisment
Advertisment
Advertisment