రెండో భార్య సాక్షిగా మూడో పెళ్లి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ

కైకలూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. అటవీశాఖ ఏలూరు రేంజ్ సెక్షన్ ఆఫీసర్‌ సుజాతను కైకలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహమాడారు. అయితే ఈ పెళ్లికి రెండో భార్య సునీత సాక్షి సంతకం చేయడం విశేషం.

New Update
రెండో భార్య సాక్షిగా మూడో పెళ్లి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ

ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ మరో పెళ్లి చేసుకున్నారు. కొల్లేరు ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంటున్న ఆయన రెండో భార్య సునీతతో విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే రెండో భార్య, పిల్లల సమక్షంలోనే మూడో పెళ్లి చేసుకోవడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. వెంకట రమణకు గతంలో రెండు వివాహాలు జరిగాయి. మొదటి భార్య అనారోగ్యంతో చనిపోగా. ఆమెకు ఒక కుమార్తె ఉన్నారు. తర్వాత కైకలూరు ప్రాంతానికి చెందిన సునీతను రెండో వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇద్దరి మధ్య కుటుంబ కలహాల కారణంగా మనస్పర్ధలు రావడంతో దూరంగా ఉంటున్నారు. జయ మంగళపై పలు కేసులు పెట్టిన సునీత విజయవాడలో ఉంటున్నారు. అప్పుడప్పుడు పిల్లలతో కలిసి జయ మంగళ ఇంటికి వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే 2019లో మచిలీపట్నం కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. అయితే సునీతతో విడిపోయిన వెంకట రమణ రీసెంట్ గా అటవీశాఖ ఏలూరు రేంజ్ సెక్షన్ ఆఫీసర్‌ సుజాతను ఏలూరు జిల్లా కైకలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి ఎమ్మెల్సీ కుమారుడు పెళ్లి పెద్దలుగా వ్యవహరించగా రెండో భార్య సునీత సాక్షి సంతకం చేయడం ఆసక్తికరమైన అంశం.

Also read :యువకుడి ప్రాణం తీసిన ప్రేయసి మెసేజ్.. ఏం పంపించిందంటే

ఇదిలా ఉంటే.. ఈ పెళ్లిపై స్పందించిన వెంటక రమణ కుటుంబ సభ్యులు తన రెండో భార్య, పిల్లల అంగీకారంతోనే ఈ వివాహం చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక రమణ మూడో భార్య సుజాతకు ఇది రెండో వివాహం. ఆమెకు ఒక కుమారుడు ఉన్నారు.ప్రస్తుతం ఈ వార్త తెలుగు రాష్ట్రల్లో చర్చనీయాంశమైంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..

సింగపూర్ స్కూల్లో మంటల్లో గాయాలపాలై ఏపీ డిప్యూటీ సీఎవ కుమారుడు మార్క్ శంకర్...చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడితో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు.

author-image
By Manogna alamuru
New Update
ap

Mark Shankar

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. అతనిని కొద్దిసేపటి క్రితమే ఇండియాకు తిరిగి తీసుకుని వచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. చికిత్స అనంతరం బాబు కోలుకున్నాడని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని..అందుకే ఇండియాలో ఇంట్లోనే ఉంచి జాగ్రత్తలు తీసుకోనున్నారని చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | deputy-cm-pawan-kalyan | pawan kalyan son mark shankar

Also Read: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

Advertisment
Advertisment
Advertisment