Uppal Stadium: ఉప్పల్‌ స్టేడియంలో సీటు మిస్సింగ్‌.. టికెట్‌ డబ్బులు ఇచ్చేయాలన్న అభిమాని

ఇటీవల ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌, చెన్నై మ్యాచ్‌లో ఓ అభిమానికి నిరాశ ఎదురైంది. రూ.4500 పెట్టి టికెట్‌ కొని స్టేడియానికి వెళ్లే సరికి అక్కడ సీటు లేకుండా పోయింది. టికెట్‌తో పాటు వీడియోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. ఇప్పడు ఈ ట్వీట్‌లు వైరల్‌ అవుతున్నాయి.

New Update
Uppal Stadium: ఉప్పల్‌ స్టేడియంలో సీటు మిస్సింగ్‌.. టికెట్‌ డబ్బులు ఇచ్చేయాలన్న అభిమాని

Uppal Stadium: IPL అంటే క్రికెట్‌ అభిమానులకు పండగే అని చెప్పాలి. ప్రత్యక్షంగా మ్యాచ్‌ను చూసేందుకు వేలు ఖర్చుపెట్టి మరీ టికెట్లు కొనుక్కుంటారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేకుండా స్టేడియానికి చేరుకుంటారు. ఇటీవల ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌, చెన్నై మ్యాచ్‌లో ఓ అభిమానికి నిరాశ ఎదురైంది. రూ.4500 పెట్టి టికెట్‌ కొని స్టేడియానికి వెళ్లే సరికి అక్కడ సీటు లేకుండా పోయింది. ఓ క్రికెట్‌ అభిమాని రూ.4500 పెట్టి టికెట్‌ కొనుగోలు చేశాడు. అతనికి జే 66 నెంబర్‌ సీటును కేటాయించారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే జే67, జే65 సీటు మధ్యలో 66 నెంబర్‌ సీటు లేదు. ఒక్కసారిగా అతను కంగుతిన్నాడు.

చేసేదేమీ లేక మ్యాచ్‌ మొత్తం నిలబడి చూడాల్సి వచ్చింది. చెన్నై సూపర్‌కింగ్స్‌ సపోర్టర్‌ జునైద్‌ అహ్మద్‌ తన టికెట్‌తో పాటు వీడియోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. స్టేడియం నిర్వాహకుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు అతని ట్వీట్‌లు వైరల్‌ అవుతున్నాయి. ఇంత అన్యాయం మరొకటి ఉండదంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. హెచ్‌సీఏ తీరుపై మండిపడుతున్నారు. అయితే మ్యాచ్‌ అయిపోయే సరికి అతని సీటు J69-70 మధ్య కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. అంతా అయిపోయిన తర్వాత సీటు ఎక్కడో కనిపించేసరికి ఏం చేసుకోవాలంటూ అసహనానికి గురయ్యాడు.

ఇది కూడా చదవండి: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే కడుపులో గడ్డలు ఉన్నట్టే..జాగ్రత్త

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే అన్ని విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పారు. 

New Update
Renu Desai

Renu desai

తనకు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని..కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణూ దేశాయ్. రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు అదే కోరికని...కానీ తాను విధి రాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు.  సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని...ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని...స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని...అందుకే వారు తాను పోలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వూతూ చెప్పారు రేణూ దేశాయ్. 

మోడీ భక్తురాలిని..బీజేపీకే సపోర్ట్..

తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని...ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులా తాను ఏదైనా పార్టీలో చేరితే కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఆమె కుమారుడు అకీరా నందన్ గురించి చెబుతూ...ఓజీ సినిమాలో అతను పని చేయడం లేదని తెలిపారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు రేణూ ఆరోపించారు. 

today-latest-news-in-telugu | renu-desai | actress | inter-view

Also Read: WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

Advertisment
Advertisment
Advertisment