ఆసుపత్రి నుంచి మంత్రి వేణుగోపాలకృష్ణ డిశ్చార్జ్ తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి నుంచి మంత్రి వేణుగోపాల్ డిశ్చార్జ్ అయ్యారు. ఛాతినొప్పితో నిన్న సాయంత్రం మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. మంత్రికి యాంజియోప్లాస్టీ చేసినట్లు మణిపాల్ వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. By V.J Reddy 28 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Minister Venugopal Krishna: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిశ్చార్జ్ అయ్యారు. నిన్న (సోమవారం) రోజు గుండె నొప్పితో వేణుగోపాలకృష్ణ తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఈరోజు ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. మంత్రికి యాంజియోప్లాస్టీ చేసినట్లు మణిపాల్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు పేర్కొన్నారు. మంత్రి వేణుగోపాలకృష్ణకి సీఎం జగన్ (CM Jagan) ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ALSO READ: ఓటు వెయ్యకపోతే సచ్చిపోతా.. కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు.. ఆ పార్టీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్రల్లో మంత్రి వేణుగోపాలకృష్ణ చురుగ్గా పాల్గొన్నారు. బీసీ వర్గానికి చెందిన మంత్రి కావడంతో సామాజిక సాధికార బస్సు యాత్రలతో పాటు బహిరంగ సభలకు ఎక్కువగా హాజరవుతున్నారు. ఇదే క్రమంలో ఆయన నిన్న అనారోగ్యానికి గురయ్యారు. ALSO READ: కాంగ్రెస్ తో ధరలు తగ్గుతాయి.. రేవంత్ కీలక వ్యాఖ్యలు! #ap-news #cm-jagan #telugu-latest-news #minister-venugopal-krishna-health-update #ysrcp-minister మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి