Telangana: ఈరోజు మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం..

తెలంగాణలో ఈరోజు నుంచి మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.. రెండు మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించనున్నారు.

New Update
Telangana: ఈరోజు మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం..

తెలంగాణలో ఈరోజు నుంచి మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.. రెండు మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేసి.. మహిళల ఆర్థిక పురోగతికి కృషి చేయాలన్న సీఎం రేవంత్‌ రేవంత్ సూచనలకు అనుగుణంగా మంత్రి సీతక్క వీటికి తుది రూపునిచ్చారు. ప్రస్తుతం బిహార్‌లో అమలవుతున్న దీదీ-కి-రసోయి విధానానికి అనుగుణంగా మహిళా శక్తి క్యాంటీన్లను రూపొందించనున్నారు.

Also Read: మరికాసేట్లో జైలు నుంచి విడుదల కానున్న కేజ్రీవాల్..

సెక్రటేరియట్‌తో సహా ఆసుపత్రులు, కలెక్టర్‌ కార్యాలయ కేంద్రాలు, ఆలయాలు, పర్యాటక ప్రంతాలు, ఆర్టీసీ బంస్టాండ్‌కు, ఇండస్ట్రియల్ పార్కులు తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా రెండేళ్లలో జిల్లాకు ఐదు చొప్పున 150 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్లాన్ సిద్ధం చేశారు. ఇక క్యాంటీన్లు పెట్టే మహిళా సంఘాలకు హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హాస్పిటాలిటీ మేనెజ్‌మెంట్‌లో శిక్షణ ఇప్పించనున్నారు. అయితే క్యాంటీన్ల మోడళ్లను బట్టి ఒక్కోదానికి ప్రతిఏడాది రూ.ఏడున్నర లక్షల నుంచి రూ.12 లక్షల దాకా లాభం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: తమిళనాడులో కల్తీసారా కలకలం.. 40కి చేరిన మృతుల సంఖ్య

Advertisment
Advertisment
తాజా కథనాలు