Ponguleti: కేసీఆర్ టార్గెట్ మేమే.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి 10 స్థానాలకు గాను 9 స్థానాల్లో విజయం సాధించామని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రచారాల్లో కేసీఆర్ తమను టార్గెట్ చేశారని అన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు.

New Update
Minister Ponguleti Srinivas: ఇళ్లు లేనివారికి ఇళ్లు కట్టిస్తాం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Minister Ponguleti Srinivas Reddy: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో సవాల్ చేసినట్టు 10కి 10 సీట్లు అన్నానని, అన్నం తింటుంటే ఓ మెతుకు జారిపడినట్లు ఓ స్థానం పోయిందని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) 10 స్థానాలకు 9 స్థానాల్లో గెలిచామన్నారు. మమ్మల్ని ఓడించాలని విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని, అధికారులను ఉపయోగించి అక్రమ కేసులు పెట్టారని పొంగులేటి ఆరోపించారు.

ALSO READ: వైసీపీ మూడో లిస్టు విడుదల.. వారికి టికెట్ కట్

కేసీఆర్ టార్గెట్ మేమే..

కేసీఆర్ (KCR) ఏ మీటింగ్ లో మాట్లాడినా తుమ్మల నాగేశ్వర్ రావు (Thummala Nageswara Rao), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే మా ఇద్దరి గురించే మాట్లాడారని అబ్బర్. కరటక ధమణుకలు అని మాకు పేరు పెట్టారని, డబ్బు మదం తో మాట్లాడుతున్నారు అని అన్నాడన్నారు. మేమేమన్న అధికారంలో ఉన్నామా? అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులుగా ఉన్నామా ప్రజల సొమ్ము దోచుకోవడానికి, కాంట్రాక్టులన్నీ ఆయన గారి బంధువులకు ఇచ్చి తెర వెనకాల ఉండి నడిపించారన్నారు. అధికార మదం మీకుండేదని, మేము సేవకులమన్నారు. శక్తి వంచన లేకుండా మంత్రులందరం ప్రజల కోసమే పనిచేస్తామని, అసెంబ్లీ లో పోట్ల గిత్తళ్ల వ్యవహరించారన్నారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి.

రాష్ట్రాన్ని అప్పులకుప్పగా..

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా కేసీఆర్ తీర్చిదిద్దారని మంత్రి పొంగులేటి అన్నారు. గత ప్రభుత్వ అప్పులను ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి భట్టి వారిస్తుంటే గొడవకు దిగారని, అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేసామన్నారు. అంతేకాకుండా.. ‘అప్పటికే అవాకులు చేవాక్కులు పేలారు. తల తాకట్టు పెట్టైనా 6 గ్యారెంటీల అమలు చేసి తీరుతాం. ఎవరన్నా తప్పుడు ప్రచారం చేస్తే తిప్పికొట్టాలని కోరుతున్న . పదేండ్లు మీ బాధలను తీర్చేందుకు ప్రజాపాలన మీ చెంతకు చేర్చాం . ప్రజల బాధలు కోట్లలో వచ్చాయి అప్లికేషన్ల రూపంలో అని మండిపడ్డారు

100 రోజులలోపే..

100 రోజులలోపే ప్రజల సమస్యలు తీరుస్తున్నాం అని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి. 'బీఆర్ఎస్ హయాంలో ఏ నెలలో ఇచ్చారు రైతుబంధు. సిగ్గుందా మీకు మమ్మల్ని అనడానికి.. కబ్జాలకు గురైన స్థలాలను వెనక్కు తీసుకోమని ఇప్పటికే కలెక్టర్ కు ఆదేశాలిచ్చాం. దోచుకున్న ప్రతి రూపాయిని కక్కించి మీకే ఖర్చు పెడతాం.. మీ కష్టాల్లో పాలు పంచుకుంటాం.. మంచి అధికారులను కాపాడుకుంటాం. తప్పు చేసిన అధికారులు మనల్ని చూసి సిగ్గుతో తల దించుకుంటున్నారు.’ అని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు