Nara Lokesh : ఇక ఉరుకోము.. మాజీ సీఎం జగన్‌కు మంత్రి లోకేష్ హెచ్చరికలు AP: కర్నూలు జిల్లాలో టీడీపీ నేత శ్రీనివాసులు హత్యను మంత్రి లోకేష్ ఖండించారు. ఎన్నికల్లో టీడీపీ గెలుపు కొరకు పనిచేశారనే కక్షతోనే వైసీపీ వాళ్ళు హత్యచేశారని ఆరోపించారు. ఓటమి తరువాత జగన్ అండ్ కో ఇలాంటి దాడులకు పాల్పడుతోందని.. నిందితులను విడిచి పెట్టేదిలేదని హెచ్చరించారు. By V.J Reddy 14 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Nara Lokesh Warnings : కర్నూలు జిల్లా (Kurnool District) పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ (TDP) మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు హత్య ఘటనపై స్పందించారు మంత్రి లోకేష్ (Lokesh). శ్రీనివాసులుపై వైసీపీ (YCP) మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ట్విట్టర్ (X) వేదికగా చెప్పారు. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసిపి మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో… pic.twitter.com/Wc3GxqTjR3 — Lokesh Nara (@naralokesh) August 14, 2024 అసలేమైంది.. పత్తికొండ మండలం హౌసురులో దారుణ హత్య కలకలం రేపింది. టీడీపీ మాజీ సర్పంచ్ భర్త వాకిటి శ్రీనివాసులు కళ్ళల్లో కారం కొట్టి వేట కొడవళ్ళతో నరికి హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. ఉదయం బహిర్భూమికి వెళ్లిన శ్రీనును అత్యంత కీరతంగా మట్టు బెట్టారు. రాజకీయ కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. Also Read : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ #nara-lokesh #ap-ycp #ap-tdp #kurnool-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి