Fire Accident: నాంపల్లి అగ్నిప్రమాదం బాధితులకు రూ.5 లక్షల పరిహారం: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ నాంపల్లి బజార్‌ఘట్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోగా వారిలో 4 రోజుల పసికందు కూడా ఉంది.

New Update
Fire Accident: నాంపల్లి అగ్నిప్రమాదం బాధితులకు రూ.5 లక్షల పరిహారం: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌లోని నాంపల్లి బజార్‌ఘట్‌లో జరిగిన అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ దుర్ఘటనలో 7గురు మృతి చెందగా.. అందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అలాగే మృతుల్లో నాలుగు రోజుల పసికందు ఉండటం కంటతడిపెట్టిస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించారు. అయితే ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.

Also Read: షర్మిలకు బిగ్ షాక్.. బీఆర్ఎస్ లో విలీనం అవుతున్నట్లు నేతల ప్రకటన!

ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అపార్ట్‌మెంట్ సెల్లర్‌లో కారు మరమ్మతులు ఏంటి.. రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎలా నిల్వ చేశారంటూ ప్రశ్నించారు దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Also Read: ప్రచారంలో వేగం పెంచుతున్న బీజేపీ…16న మేనిఫెస్టో విడుదల

Advertisment
Advertisment
తాజా కథనాలు