Anganwadi: అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన మంత్రి! AP: గత ప్రభుత్వంలో అంగన్వాడీలు ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ తాము పరిష్కరిస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హామీ ఇచ్చారు. సోమవారం మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె గిరిజన స్కూళ్ల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని చెప్పారు. By srinivas 17 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP News: ఏపీ అంగన్వాడీలకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి భారీ ఊరటనిచ్చే వార్త చెప్పారు. గత ప్రభుత్వంలో అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తమ ప్రభుత్వంలో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు విజయనగరం సాలూరు ఎమ్మెల్యేగా గెలిచిన సంధ్యారాణి మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజన స్కూళ్ల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. గిరిజన స్కూళ్లలో డ్రాప్ అవుట్లను త్వరగా నివారించేందుకు కృషి చేస్తాం. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమిస్తాం. ఐటీడీఏ, ఐసీడీఎస్‌లోనూ ప్రక్షాళన చేపడతామంటూ మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు. #ap #anganwadis #gummidi-sandhyarani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి