Andhra Pradesh: రెవెన్యూ శాఖలో ప్రక్షాళన.. రీ సర్వే కోసం గ్రామ సభలు.. మంత్రి అనగాని కీలక ప్రకటన

ఏపీలో రిజిస్ట్రేషన్స్, భూ సర్వే మీద సీఎం చంద్రబాబు సమీక్ష చేశారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో ప్రజల నుంచి ఎక్కువగా వినతులు భుముల మీదే వస్తున్నాయని.. రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరగుతుందని వెల్లడించారు.

New Update
Andhra Pradesh: రెవెన్యూ శాఖలో ప్రక్షాళన.. రీ సర్వే కోసం గ్రామ సభలు.. మంత్రి అనగాని కీలక ప్రకటన

ఏపీలో రిజిస్ట్రేషన్స్, భూ సర్వే మీద సీఎం చంద్రబాబు సమీక్ష చేశారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో ప్రజల నుంచి ఎక్కువగా వినతులు భుముల మీదే వస్తున్నాయని.. రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరగుతుందని పేర్కొన్నారు. ' మధనపల్లి ఘటనలో రాజకీయ పార్టీ నాయకుల చేతుల్లో అధికారులు బందీలుగా మారారు. రెవిన్యూ శాఖ అధికారులు ఎక్కడికి వెళ్లినా వందల సంఖ్యలో వినతులు ఇచ్చారు. అసైన్డ్ ల్యాండ్స్‌లో జరిగిన అవకతవకలు, 22-A నిషేధ భూములపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకువస్తామని చెప్పారు.

Also Read: నా కొడుకును చంపేశారు సార్.. పవన్ కల్యాణ్‌ ఎదుట మహిళ ఆవేదన!

సమగ్ర భూ సర్వే పేరుతో, సర్వే రాళ్ళపై, పట్టాదారు పాస్ పుస్తకాలపై గత ముఖ్యమంత్రి ఫొటో పిచ్చితో తన ఫొటోలు పెట్టుకున్నాడు. జగన్ ఫొటో తీయాలంటే రూ.12 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రజాధనం నిరూపయోగం కాకుండా ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. గత పాలకుల భూదాహం కారణంగా వేలాది మంది బాధితులుగా మారారు. 13 జిల్లాల్లో బాధితులు కోసం ప్రత్యేక సెల్ ఏర్పాట్లు చేస్తాం. రీ సర్వే కోసం గ్రామ సభలు పెడతాం. మదనపల్లి ఫైల్స్ కేసులో కచ్చితంగా కుట్ర కోణం దాగి ఉంది. ఈ కేసులో పెద్దిరెడ్డి ఉన్నా వదిలేపెట్టేది లేదు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. విశాఖలో భారీగా భూ కుంభకోణాలు జరిగాయి. త్వరలోనే వీటిపై విచారణ చేస్తాం.

Also read: పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఔట్.. ఇక కేవలం రాజముద్ర మాత్రమే!

కొత్తగా ఇచ్చే పాస్ పుస్తకాలపై QR కోడ్ తీసుకోస్తాం. పట్టదారు పాస్ పుస్తకాల మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో త్వరలోనే పాస్ బుక్‌లు రైతులకు అందజేస్తాం. మదనపల్లి ఘటనలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరగలేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు. కెమికల్ రియాక్షన్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చు. కొన్ని తప్పుడు పత్రాలు ఉన్నాయి. MRO సంతకాలు ఫోర్జరీ చేసిన పత్రాలు కుడా ఉన్నాయి. అక్కడ అధికారులు కుడా మేము సంతకాలు పెట్టలేదని.. మా సంతకాలు ఫోర్జరీ జరిగాయని అధికారులు చెబుతాన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు