Telangana: ఎంఐఎం, కాంగ్రెస్ లో విలీనమవుతుంది- మహేశ్వర్ రెడ్డి

బీజేపీలో.. బీఆర్ఎస్ మెర్జ్ అవుతుందని అసదుద్దీన్ అంటున్నాడని, ఇందులో ఏమాత్రం నిజం లేదని, కానీ ఎంఐఎం పార్టీయే.. కాంగ్రెస్ లో విలీనమవుతుందని బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బీజేఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు.

New Update
Telangana: ఎంఐఎం, కాంగ్రెస్ లో విలీనమవుతుంది- మహేశ్వర్ రెడ్డి

BJLP Leader Maheswara reddy: ఎంఐఎం ఇప్పటికే కాంగ్రెస్ తో చట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతోందని బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి అంటున్నారు. బీజేపీలో బీఆర్ఎస విలీసనం అవుతుందని అసద్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదని కొట్టిపారేశారు. రేవంత్ సర్కార్.. రైతులను ఇబ్బందులు పెట్టేందుకే మాఫీకి నిబంధనలు తీసుకొచ్చిందని ఏలేటి విమర్శలు చేశారు. గత ప్రభుత్వంపై విద్యుత్ కొనుగోలులో అవినీతి అంటూ వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీకి కమిషన్ ను ఏర్పాటుచేసిందని, అయితే విచారణ కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును రేవంత్ దున్నపోతుపై వాన పడినట్టుగా భావిస్తున్నారని చురకలంటించారు. ఈ కమిషన్ ఎంక్వైరీలో పారదర్శకత పాటించడం లేదని, అందుకే సీబీఐ విచారణకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో కి 10 మంది ఎమ్మెల్యేలు మారారని,అయితే ఆ 10 స్థానాల్లో బై ఎలక్షన్ పెట్టాలని ఆయన డిమాండ చేశారు. ఉప ఎన్నిక జరిగితే బీజేపీకి ప్లస్ అవుతుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు రాకముందే కాంగ్రెస్ 2/3 వంతు సభ్యులను మెర్జ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. అయితే 200 శాతం దానం నాగేందర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉప ఎన్నిక తథ్యమని ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read:National: ఉగ్రవాదాన్ని రూపుమాపుతాం – రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు