Microsoft: మైక్రోసాఫ్ట్ షాకింగ్ నిర్ణయం.. 24 కోట్ల కంప్యూటర్లపై ఎఫెక్ట్! By Bhavana 22 Dec 2023 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి మైక్రోసాఫ్ట్ (Microsoft) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కొత్తగా వచ్చే ల్యాప్‌టాప్స్ , కంప్యూటర్లలో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ కి ముగింపు పలకాలని భావిస్తోంది. దీని ప్రభావం సుమారు 24 కోట్ల పర్సనల్ కంప్యూటర్ల మీద ప్రభావం చూపించవచ్చని తెలుస్తుంది. దీని వల్ల ల్యాండ్ ఫిల్ వ్యర్థాలు పెరిగే అవకాశం ఉన్నట్లు ఓ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ఈ పీసీల నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు 3,20,000 కార్లకు సమానమైన 480 మిలియన్ కిలోల బరువు ఉంటుందని సంస్థ అంచనా వేసింది. అయితే ఓఎస్ సపోర్టు ముగిసినప్పటికీ కూడా చాలా కంప్యూటర్లు ఇంకా చాలా సంవత్సరాలు పనిచేస్తున్నాయని..దీని వల్ల సెక్యూరిటీ అప్టేడ్ లేని పరికరాల డిమాండ్ తగ్గే అవకాశం ఉందని కెనాలిస్ హెచ్చరించింది. అయితే విండోస్ 10 పరికరాల కోసం అక్టోబర్ 2028 వరకు కూడా సెక్యూరిటీ అప్టేట్స్ అందించే ప్రణాళికను వివరించింది. అయితే ఇది ఎంత ధర ఉంటుందనే వివరాలను తెలపలేదు. విండోస్ 10 సపోర్ట్ సెక్యూరిటీ అప్డేట్స్ కోసం ధరను ప్రతిపాదిస్తే.. కొత్త పీసీలకు మారడం అనేది ఖర్చుతో కూడుకున్న పనిగా ఉంది. దీంతో ఇది స్క్రాప్ గా మారిపోతుంది. దీంతో అక్టోబర్ 2025 నాటికి విండోస్ 10 సపోర్ట్ నిలిపివేయాలని మైక్రోసాఫ్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ఏఐ సాంకేతికతను జోడించి ఓఎస్ తీసుకురావడం వల్ల మందగించిన పీసీ మార్కెట్ ని సమర్థవంతంగా పెంచుతుందని కంపెనీ తెలిపింది. పనిచేయకుండా పోయిన కంప్యూటర్లు , అయస్కాంతాలుగా మారతాయని ఇవి ఎలక్ట్రిక్ మోటార్లలో, విండ్ టర్బైన్లలో వాడుతారని నోవెన్ మాగ్నెటిక్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పీటర్ అఫియునీ అన్నారు. కంప్యూటర్లు, డేటా స్టోరేజ్ సర్వర్లలో ఉపయోగించే హార్డ్ డ్రైవ్‌లు ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లలో ఉపయోగించేందుకు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కోసం రీసైకిల్ చేయబడుతాయి. Also read: మీరు నా పెళ్లికి రాలేదుగా..అందుకే ఈ ఫైన్ కట్టాల్సిందే..ఓ వధువు వింత ఆలోచన! #microsoft #windows10 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి