Microplastics : పురుషుల వృషణాల్లో మైక్రోప్లాస్టిక్స్.. సంతానోత్పత్తిపై ప్రభావం మగవారి వృషణాల్లో ప్లాస్టిక్ కణాలు చేరుతున్నట్లు తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో బయటపడింది. దీనివల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడానికి ఇవే కారణమై ఉంటాయ అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉంది. By B Aravind 22 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Human Health : ప్రపంచవ్యాప్తంగా ప్లాసిక్ వాడకం (Plastic Usage) విపరీతంగా పెరిగిపోయింది. ఆఖరికీ తాగే నీళ్లు (Drinking Water), తినే తిండిలో కూడా ప్లాస్టిక్ కలిసిపోతోంది. దీనివల్ల ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి చేరి వివిధ అవయవాల్లోకి కూడా చేరుతున్నాయి. మనుషుల రక్తం, గుండె, తల్లిపాలలో మైక్రో ప్లాస్టిక్స్ (Microplastics) చేరుతున్నాయని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. అయితే తాజాగా మగవారి వృషణాల్లో (Human Testicle) కూడా ప్లాస్టిక్ కణాలు చేరుతున్నట్లు మరో పరిశోధనలో బయటపడింది. దీనివల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడానికి ఇవే కారణమై ఉంటాయ అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. Also read: కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపులు.. నిందితుడు అరెస్టు ఇక వివరాల్లోకి వెళ్తే.. పరిశోధనలో భాగంగా 23 మంది పురుషుల మృతదేహాలు, 47 పెంపుడు జంతువు కళేబరాల నుంచి సేకరించిన వృషణాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ప్రతి శాంపుల్స్‌లో కూడా మైక్రో ప్లాస్టిక్‌ల కాలుష్యం కనిపించింది. కుక్కల్లో ప్రతి గ్రాము కణజాలంలో 123 మైక్రోగ్రాములు, మానవుల్లో 330 మైక్రోగ్రాముల మేర ఈ రేణువులు కనిపించాయి. ప్లాస్టిక్ సంచులు, బాటిళ్లలో వాడే పాలీఇథలీన్ పదార్థాలు వృషణాల్లో ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఆ తర్వాతి స్థానంలో పీవీసీ ఉంది. అయితే పీవీసీ కాలుష్యం వల్ల శనకాల వృషణాల్లో వీర్య కణాల సంఖ్య తగ్గినట్లు గుర్తించారు. ఈ మైక్రోప్లాస్టిక్‌ల కారణంగా సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుందా అనేదానిపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దశాబ్దాలుగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీనికి క్రిమిసంహారకాలు వంటి కెమికల్స్ కారణమని భావిస్తున్నారు. అయితే సూక్ష్మ ప్లాస్టిక్‌లు నీరు, ఆహారం, గాల్లో కూడా తిష్ట వేయడం ఆందోళన రేపుతోంది. ఇవి మనుషుల రక్తనాళాల్లోకి చేరడం వల్ల పక్షవాతం, గుండెపోటు లాంటి సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు పేర్కొన్నారు. ఇక పీవీసీ నుంచి రిలీజ్ అయ్యే రసాయనాలు.. వీర్య కణాల ఉత్పత్తికి ఆటంకం కలిగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మెక్రోప్లాస్టిక్స్ వల్ల వీర్య కణాల సంఖ్య తగ్గొచ్చని ఎలుకలపై జరిగిన పరిశోధనల్లో ఇప్పటికే బయటపడింది. Also read: మేము అధికారంలోకి వస్తే ఒక్కరే ప్రధాని.. మోదీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్ #telugu-news #infertility #testicle #microplastics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి