Anantapur: అనంతపురంలో 'ఠాగూర్' మూవీ ఆస్పత్రి సీన్ రిపీట్.. బ్రతికే ఉందని 4 గంటలు చికిత్స!!

కర్నూలు జిల్లాకు చెందిన మోదీన్ బీ (32)కి అనంతపురంలోని పీసీ ప్యాపిలికి చెందిన కానిస్టేబుల్ వన్నూరు స్వామితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఇంతవరకూ వారికి పిల్లలు కలగ లేదు. దీంతో పిల్లల కోసం అనంతపురంలోని ఓ ఆస్పత్రిలోని గైనకాలజిస్టును సంప్రదించారు. ఆమె ఐవీఎఫ్‌ ద్వారా సంతానం కలిగేలా చికిత్స చేస్తానని నమ్మ బలకడంతో, కుటుంబ సభ్యులు ఆమె మాటలు నమ్మారు. ఏవేవో టెస్టుల పేర్లు చెప్పి.. మూడు నెలలుగా ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందించారు. మంగళవారం మధ్యాహ్నం సర్జరీ కోసమని మోదీన్‌ బీని ఆపరేషన్‌ థియేటర్ ‌కు తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్లే ముందే మోదీన్ బీకి ఓ మందు ఇవ్వగా.. అది వికటించి నిమిషాల వ్యవధిలోనే మృతి చెందింది.

New Update
Anantapur: అనంతపురంలో 'ఠాగూర్' మూవీ ఆస్పత్రి సీన్ రిపీట్.. బ్రతికే ఉందని 4 గంటలు చికిత్స!!

Megastar Tagore Hospital Scene Repeat in Anantapur Private Hospital: మెగాస్టార్ చిరంజీవి నటించి 'ఠాగూర్' సినిమాలోని కొన్ని సీన్లు అలా గుర్తిండిపోతాయి. అందులో ఒకటి ఆస్పత్రిలోని సీన్. ఈ సీన్.. ఎన్నో కార్పొరేట్ ఆస్పత్రులకు చమటలు పెట్టిందింది. ఈ సినిమాలోని ఉన్న కొన్ని సీన్లు నిజ జీవితాల్లో కూడా జరుగుతున్నాయి. అందులో ఆస్పత్రిలోని సీన్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. చనిపోయిన వ్యక్తి బ్రతికే ఉన్నాడని నమ్మించి, కొన్ని గంటల పాటు చికిత్స చేసి.. లక్షల రూపాయలు గుంజుకోవడానికి నాటకం ఆడారు. సరిగ్గా అలాంటి సీనే తాజాగా అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. చనిపోయిన మహిళ బ్రతికే ఉందని నాలుగు గంటల పాటు ఓ ఆస్పత్రి సిబ్బంది నాటకం ఆడారు. సీన్ కట్ చేస్తే.. అసలు విషయం బయట పడింది.

వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాకు చెందిన మోదీన్ బీ (32)కి అనంతపురంలోని పీసీ ప్యాపిలికి చెందిన కానిస్టేబుల్ వన్నూరు స్వామితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఇంతవరకూ వారికి పిల్లలు కలగ లేదు. దీంతో పిల్లల కోసం అనంతపురంలోని ఓ ఆస్పత్రిలోని గైనకాలజిస్టును సంప్రదించారు. ఆమె ఐవీఎఫ్‌ ద్వారా సంతానం కలిగేలా చికిత్స చేస్తానని నమ్మ బలకడంతో, కుటుంబ సభ్యులు ఆమె మాటలు నమ్మారు. ఏవేవో టెస్టుల పేర్లు చెప్పి.. మూడు నెలలుగా ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందించారు. మంగళవారం మధ్యాహ్నం సర్జరీ కోసమని మోదీన్‌ బీని ఆపరేషన్‌ థియేటర్ ‌కు తీసుకెళ్లారు.

లోపలికి తీసుకెళ్లే ముందే మోదీన్ బీకి ఓ మందు ఇవ్వగా.. అది వికటించి నిమిషాల వ్యవధిలోనే మృతి చెందింది. ఈ విషయం తెలిస్తే కుటుంబ సభ్యులు నానా రాద్ధాంతం చేస్తారని భయపడి.. గంటపాటు అలానే ఉంచారు. ఆ తర్వాత లోపలికి పిలిచి.. మోదీన్‌ బీకి మూర్ఛ వచ్చిందని, పరిస్థితి చాలా సీరియస్‌ గా ఉందని, వెంటనే బెంగళూరుకు తీసుకొని వెళ్లాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. ఆమె బ్రతికే ఉందని నమ్మించేందుకు.. ఆక్సిజన్‌ ను కృత్రిమంగా పంపింగ్‌ చేస్తూ నాటకం ఆడాడు. ఇలా 4 గంటల పాటు ఆ మహిళ మృతి చెందిన విషయం చెప్పకుండా ఆపరేషన్‌ థియేటర్‌ లోనే ఉంచేశారు.

ఇక పరిస్థితి చెయ్యి దాటిపోయిందనుకున్న ఆసుపత్రి సిబ్బంది.. రాత్రి 7:45 గంటలకు సేఫ్టీ కోసం పోలీసుల్ని పిలిపించి, మోదీన్‌ బీ చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతురాలు గుత్తి మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ వన్నూరమ్మ మేనకోడలు కావడంతో.. బంధువులు పెద్దఎత్తున ఆసుపత్రికి తరలివచ్చారు. ఆసుపత్రిలోని ఐసీయూ గదిని ధ్వంసం చేయడంతో పాటు అద్దాలు పగులకొట్టారు. వైద్యులు, పోలీసులపై కూడా ఎటాక్ చేశారు. చివరికి సీఐలు, ఎస్సైలు రంగంలోకి దిగి.. పరిస్థితిని అదుపు చేశారు. అయితే ఆసుపత్రిని సీజ్‌ చేయాలని బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rain Alert:  ఉరుములు..మెరుపులు...ఏడు రోజులు భారీ వర్షాలు.. ఎక్కడంటే?

వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు రానున్న రోజుల్లో దేశంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అశకాశాలున్నాయని తెలిపింది.

New Update
  Rain Alert For Telangana

Rain Alert

Rain Alert : వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటే , మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో దేశంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అశకాశాలున్నాయని తెలిపింది. రాబోయే ఏడు రోజుల పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని ఈశాన్య, దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అలాగే దక్షిణ భారత దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కు మార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!
 
ముఖ్యంగా అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అస్సాంలోని గౌహతిలో  భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రెండు మూడు గంటల పాటు కురిసిన వర్షం కారణంగా.. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో రాబోయే 24 గంటల్లో అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో కూడా భారీ వర్షాలు, బలమైన గాలులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!
 
అయితే.. వాయువ్య బీహార్ మీదుగా తుఫాను ఏర్పడిందని.. ఇది మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడుతుంది. దీని ప్రభావంతో రాబోయే 7 రోజులు ఈశాన్య భారతదేశంలో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ నెల22 నుంచి27 మధ్య అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు నాగాలాండ్, మణిపూర్, మిజోరం మరియు త్రిపురలలో కూడా భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?
 
ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

 

 

Advertisment
Advertisment
Advertisment