Olympic Games 2024 : ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకలో మెగా ఫ్యామిలీ.. అరుదైన వీడియో షేర్ చేసిన ఉపాసన..!

మెగాస్టార్ ఫ్యామిలీ అంతా ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మెగా కోడలు ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈఫిల్ టవర్ ముందు సెన్ నది ఒడ్డున ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ వద్ద మెగా ఫ్యామిలీ ఈ వేడుకలను వీక్షించింది.

New Update
Olympic Games 2024 : ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకలో మెగా ఫ్యామిలీ.. అరుదైన వీడియో షేర్ చేసిన ఉపాసన..!

Mega Family At Paris Olympics 2024 : ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్‌ (Olympics) వేడుకలు పారిస్‌ (Paris) లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు చూసేందుకు పలువురు సినీ తారలు, సందర్శకులు తరలివచ్చారు. ఇందులో భాగంగా మెగాస్టార్ ఫ్యామిలీ (Megastar Family) అంతా ఒలంపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మెగా కోడలు ఉపాసన (Upasana) తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

publive-image

ఈఫిల్ టవర్ ముందు సెన్ నది ఒడ్డున ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ వద్ద మెగా ఫ్యామిలీ ఈ వేడుకలను వీక్షించింది. చిరంజీవి (Chiranjeevi), సురేఖ పారిస్ వీధుల్లో నడుస్తున్న దృశ్యాలను ఈ వీడియోలో చూపించారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరోవైపు ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నచిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి దిగిన ఓ ఆసక్తికర ఫొటోని తాజాగా ఎక్స్‌ (ట్విట్టర్) లో షేర్‌ చేశారు.

publive-image

ఈ మేరకు ఆ పోస్ట్ లో.. "పారిస్‌ వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైనందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సురేఖతో కలిసి ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకోవడం సంతోషకరమైన క్షణం. ఈ పోటీల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్‌ ది బెస్ట్‌. పతకాలు తీసుకురావాలని కోరుకుంటున్నా" అని పేర్కొన్నారు.

Also Read : మద్యం ప్రియులకు షాక్.. రేపు, ఎల్లుండి మద్యం షాపులు బంద్



Advertisment
Advertisment
తాజా కథనాలు