Layoffs: న్యూఇయర్ లోనూ భారీగా భారీ లేఆఫ్‌లు.. ఉద్యోగులకు షాకిచ్చిన లేటెస్టే సర్వే! 2023 ని మించి 2024 లో భారీగా ఉద్యోగుల తొలగింపులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగార్థుల రెజ్యూమ్ ల రూపకల్పనలో తోడ్పాటు అందించే ప్రొఫెషనల్ ప్లాట్ ఫామ్ రెజ్యూమ్ బిల్డర్ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. అందులో ఈ ఏడాదిని మించి సుమారు 30 శాతం అధికంగా తొలగింపులు ఉంటాయని తెలుస్తుంది. By Bhavana 28 Dec 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి కరోనా వచ్చిన తరువాత కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికే చేస్తున్నాయో లేక మరేతర కారణాల వల్ల చేస్తున్నాయో కానీ సంస్థల నుంచి భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. చిన్న కంపెనీలు ఈ పని చేశాయి అనుకుంటే పొరపాటే..ఎక్కువ శాతం మంది లే ఆఫ్ లు తీసుకున్న ఉద్యోగులందరూ కూడా పెద్ద పెద్ద కంపెఈల వారే. గూగుల్, మైక్రో సాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థల ఉద్యోగులే కనీసం వారికి మెయిల్ కూడా లేకుండా ఇంటికి వెళ్లిపోమంటూ తెలిపాయి. ఈ ఉద్వాసనలు ఈ ఏడాదితో ఆగి పోతే బాగుండు అని చాలా మంది ఉద్యోగులు అనుకున్నారు కానీ..ఈ లే ఆఫ్ లు వచ్చే సంవత్సరం కూడా సాగేటట్లు కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. 2023 ని మించి 2024 లో భారీ తొలగింపులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే ఉద్యోగులను కలవరపెడుతుంది. ఉద్యోగార్థుల రెజ్యూమ్ ల రూపకల్పనలో తోడ్పాటు అందించే ప్రొఫెషనల్ ప్లాట్ ఫామ్ రెజ్యూమ్ బిల్డర్ తాజాగా ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సుమారు 10 కంపెనీలు పాల్గొంటే వారిలో సుమారు 6 కంపెనీలు కొత్త ఏడాదిలో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఎందుకు ఈ లే ఆఫ్ లు చేపడుతున్నారని సదరు కంపెనీలను ప్రశ్నించగా..నాలుగు కంపెనీలు ఆర్థిక మాంద్యం కారణమని తెలిపాయి. అంతే కాకుండా కొన్ని కంపెనీలు ఉద్యోగుల స్థానాల్లో ఏఐ ని ఉపయోగించనున్నట్లు వివరించాయి. గూగుల్ తన యాడ్ సేల్స్ యూనిట్లలోని 30 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. అయితే ఈ ఉద్యోగుల తొలగింపుల్లో కూడా కొన్ని తేడాలు ఉన్నట్లు సర్వే వివరించింది. మధ్య తరహా కంపెనీల్లో 42 శాతం , పెద్ద కంపెనీల్లో 39 శాతం తొలగింపులు ఉంటాయని తెలుస్తుంటే.. చిన్న కంపెనీల్లో 28 శాతం మాత్రమే లే ఆఫ్ లు ఉంటాయని కంపెనీల ప్రతినిధులు వివరించారు. వీటిలో కూడా ఎక్కువ గా నిర్మాణ, సాఫ్ట్ వేర్ కంపెనీలు వరుసగా 66 శాతం, 65 శాతం సిబ్బందిని వచ్చే సంవత్సరంలో తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. Also read: స్మార్ట్ ఫోన్ కంపెనీ Xiaomi అదిరిపోయే ఎలక్ట్రిక్ కార్.. ఒకే ఛార్జ్ తో హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లొచ్చు! #2024 #jobs #layoffs #companys మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి