Bharat Bandh: రేపు భారత్ బంద్.. మావోయిస్టుల పిలుపు

రేపు భారత్ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఛత్తీస్ గఢ్, ఏపీ, తెలంగాణ సరిహద్దులో హైఅలర్ట్ ప్రకటించింది పోలీస్ శాఖ. సరిహద్దు ప్రాంతాల్లో భారీగా భద్రత బలగాల చేరుకున్నాయి.

New Update
Bharat Bandh: రేపు భారత్ బంద్.. మావోయిస్టుల పిలుపు

Maoists Calls For Bharat Bandh: రేపు (శుక్రవారం) భారత్ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఏజెన్సీలో హైఅలెర్ట్ ప్రకటించారు పోలీసులు. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దులో కూంబింగ్ చేపట్టారు పోలీస్ అధికారులు. దండకారణ్యాన్ని భద్రత బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీస్ యంత్రంగం. ఇదిలా ఉండగా ఏపీలో విధ్వసం సృష్టించారు మావోయిస్టులు. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. వీరాపురం దగ్గర వాహనాలపై మావోయిస్టులు దాడి చేశారు. కార్లకు నిప్పంటించారు. ఈ నెల 22న అంటే రేపు తాము ఇచ్చిన భారత్ బంద్ పిలుపుని విజయవంతం చేయాలంటూ కరపత్రాలను వదిలి వెళ్లారు మావోయిస్టులు. అయితే మావోయిస్టుల డిమాండ్స్ పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. నిన్న పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పులలో 8 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి నిరసనగా రేపు భారత్ బంద్ కు మావోయిస్టులు పిలుపు నిచినట్లు తెలుస్తోంది.publive-image publive-image

ALSO READ: అరెస్ట్ తరువాత పల్లవి ప్రశాంత్ ఎక్కడ ఉన్నాడంటే..

నిన్న(బుధవారం) ఛత్తీస్ ఘడ్ లో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు

ఛత్తీస్ ఘడ్ లోని మావోయిస్టులకు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. సుక్మాజిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిథిలోని దండకారణ్యంలో మావోయిస్ట్ బేస్ క్యాంపులను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఇందులో భారీ మొత్తంలో మావోయిస్టుల సామాగ్రిని, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో భద్రతాబలగాలు ఎనిమిది మంది మావోస్టులను చంపినట్టు అధికారిక వర్గాల నుంచి సమాచారం.

ALSO READ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్!

Advertisment
Advertisment
తాజా కథనాలు