Massage: మగవారికి మసాజ్‌ వల్ల కలిగే లాభాలు..ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

శరీరానికి మసాజ్ చేయడం వల్ల కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందడంతోపాటు వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. నరాల నియంత్రణ, మెదడు పనితీరును పెంచడంలో మసాజ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మంచి ఆయిల్ మసాజ్ పురుషులు, మహిళలు ఇద్దరికీ అవసరమని చెబుతున్నారు.

New Update
Massage: మగవారికి మసాజ్‌ వల్ల కలిగే లాభాలు..ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Massage: శరీరానికి మసాజ్ చేయడం చాలా మంచిది. ఆరోగ్యానికి కూడా ఇది చాలా అవసరం. బాడీ మసాజ్ పురుషులు, మహిళలు ఇద్దరికీ అవసరం. పురుషులకు ఎక్కువ శరీర మసాజ్ అవసరమని థెరపిస్టులు సూచిస్తున్నారు. కనీసం నెలకు ఒకసారి పూర్తి శరీర మసాజ్ చేయడం చాలా ముఖ్యం. శరీరానికి మసాజ్ చేయడం వల్ల కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందడంతోపాటు వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

ఆందోళనను తగ్గిస్తుంది:

  • ఎక్కువ వ్యాయామం చేసే వ్యక్తులు ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తారు. కండరాలు కూడా అలసిపోతాయి. మసాజ్ కండరాలను సడలించడానికి, బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. నరాల నియంత్రణ, మెదడు పనితీరును పెంచడంలో మసాజ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిలో సానుకూల ఆరోగ్య మార్పులను తీసుకొస్తుంది.

తెల్లజుట్టు నల్లగా మారుతుందా?

  • బాడీ మసాజ్ చేయడం వల్ల గ్రే హెయిర్‌ నల్లగా అవుతుందా..అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మసాజ్‌ చేయడం వల్ల తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంతో పాటు తెల్ల జుట్టు కూడా నల్లగా అవుతుందని నిపుణులు అంటున్నారు.

తిమ్మిర్లు దూరమవుతాయి:

  • ఆఫీసులో గంటల తరబడి ఒకే చోట కూర్చుని గడిపితే కండరాలు అలసిపోతాయి. కొన్ని రకాల నొప్పులు, నరాల నొప్పులు, కండరాల నొప్పులు వస్తాయి. మసాజ్ వీటిని సరిచేయడానికి, శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచడానికి సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

  • గోరువెచ్చని నూనెను చర్మానికి రాసి బాగా మసాజ్ చేయడం వల్ల చర్మం పొడిబారడం తొలగిపోయి ముఖం నుంచి అరికాళ్ల వరకు చర్మం బాగా తేమగా ఉంటుంది.

మంచి నిద్ర:

  • మంచి ఆయిల్ మసాజ్ చేశాక గోరువెచ్చని స్నానం చేసి బెడ్‌పై పడుకుంటే నిద్ర బాగా వస్తుంది. ఎందుకంటే నూనెతో బాగా మసాజ్ చేస్తే శరీరమంతా కండరాలు టెన్షన్ తగ్గి రిలాక్స్‌గా ఉంటాయి. దీంతో నిద్ర కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా వెన్నునొప్పి కూడా తగ్గుంది.

ఇది కూడా చదవండి: నోటి క్యాన్సర్‌ను నివారించే మార్గాలు..వెంటనే పరిష్కారం

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raj Tarun: ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన యంగ్ హీరో..

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్'తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమా టీజర్ విడుదలై ప్రమోషన్స్ షురూ అయ్యాయి. గత వివాదాల తర్వాత పెద్దగా కనిపించలేదు రాజ్, తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. 

New Update
Raj Tarun

Raj Tarun

Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ గురించి చెప్పాలంటే, అతని స్టైల్ కొంచెం ప్రత్యేకమే. కేవలం సినిమా ప్రమోషనన్స్ టైమ్ లో మాత్రమే కనిపించి, తర్వాత పూర్తిగా మాయమవ్వడం అతని అలవాటుగా కనిపిస్తోంది. మూవీ రిలీజ్ టైమ్ లో తప్ప మిగతా రోజుల్లో  ఏమాత్రం అప్‌డేట్స్ లేకుండా మాయమయిపోతుంటాడు.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

అయితే ఇక్కడ విషయం ఏంటంటే, రాజ్ తరుణ్ లాగానే అతని సినిమాలు కూడా అంతే త్వరగా మాయమవుతాయి. ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాడో, టైటిల్ ఏంటి, ఎప్పుడు విడుదలవుతుందో ఇవేమి ఎవరికీ తేలేదు. సడన్ గా కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంటాడు.

‘పాంచ్ మినార్’ ప్రమోషన్స్..

అయితే ఈ సారి కూడా అదే జరిగింది,  రాజ్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చాడు. ‘పాంచ్ మినార్’(Paanch Minar) అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. చిత్ర బృందం టీజర్‌ను లాంచ్ చేసింది. ఇకపై సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను వరుసగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విడుదల కూడా త్వరలోనే ఉండబోతుందట.

Also Read: ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-2’: రాఖీ భాయ్ విధ్వంసానికి మూడేళ్లు!

ఇదంతా పక్కనపెడితే, గతంలో రాజ్ తరుణ్ పై వచ్చిన వ్యక్తిగత వివాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. లావణ్య అనే మహిళ రాజ్ తరుణ్ తన భర్త అని మీడియా ముందుకొచ్చి సంచలనం సృష్టించింది. ఆ వివాదం పెద్ద చర్చకు దారితీసినా, చివరికి ఆమెనే మళ్లీ అతనికి క్షమాపణలు చెప్పింది. తన ఆరోపణలకు తానే క్లారిటీ ఇవ్వడంతో, రాజ్ తరుణ్ తిరిగి తెరపైకి వస్తాడని అందరూ భావించారు.

Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..

అయితే ఆ వివాదం సద్దుమణిగాక  కూడా రాజ్ తరుణ్ మాత్రం మౌనం వీడలేదు, కావాలనే అజ్ఞాతం లోకి వెళ్ళాడో, లేదంటే ప్లాన్డ్ సైలెన్స్‌లో ఉన్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇప్పుడు మరోసారి సినిమా విడుదల దశకు చేరుకోవడంతో మీడియా ముందుకొచ్చిన రాజ్ తరుణ్, సినిమా ప్రమోషన్స్ ముగిసిన తర్వాత మళ్లీ మాయమవుతాడా? అన్నది ప్రెశ్నగా మారింది.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

Advertisment
Advertisment
Advertisment