Crime: వీడు మనిషేనా అసలు..అరుస్తుందని కుక్కని

తమ ఎదురింట్లో ఉండే కుక్క ఎక్కువగా అరుస్తుందని..ముందు దాని యజమాని అయిన మహిళ పై దాడి చేయడంతో పాటు తీవ్ర వేధింపులకు గురి చేశాడు ఓ వ్యక్తి . అతనికి అతని తండ్రి కూడా సహకరించాడు. ఈ విషయం గురించి ఆ మహిళ వారిద్దరి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.

New Update
Crime:  వీడు మనిషేనా అసలు..అరుస్తుందని కుక్కని

ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఎదురింట్లో ఉన్న కుక్క పదే పదే అరుస్తుందని దాని మీద రెచ్చి పోయాడు ఓ వ్యక్తి. తన పైశాచికత్వాన్ని కుక్క మీద చూపించాడు. తన ఓనర్‌ మీద దాడి చేస్తున్నారని కుక్క అదే పనిగా అరవడంతో దాని మీద విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా దాని ప్రైవేట్‌ భాగాల్లో ఇనుప రాడ్‌ ని చొప్పించాడు ఓ దుర్మార్గుడు.

ఈ దారుణ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. తమ ఎదురింట్లో ఉండే కుక్క ఎక్కువగా అరుస్తుందని..ముందు దాని యజమాని అయిన మహిళ పై దాడి చేయడంతో పాటు తీవ్ర వేధింపులకు గురి చేశాడు ఓ వ్యక్తి . అతనికి అతని తండ్రి కూడా సహకరించాడు. ఈ విషయం గురించి ఆ మహిళ వారిద్దరి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also read: ప్రముఖ నటికి షాకిచ్చిన కోర్టు..15 రోజుల్లో లొంగిపోవాల్సిందే అంటూ ఆదేశాలు!

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అసలేం జరిగిందంటే..చందన్‌ నాయక్‌ అనే వ్యక్తి ఎదురింటిలో ఓ మహిళ ఉంటుంది. ఆమె ఓ కుక్కను పెంచుకుంటుంది. అది ఎంతసేపు ఆపకుండా అరుస్తుందన్న కారణంతో చందన్‌ అతని తండ్రి మహిళ ఇంటి ముందు గొడవకు దిగారు.

దీంతో ఆమె ఇంటి నుంచి బయటకు రావడంతో ఆమె మీద తండ్రి కొడుకులు ఇద్దరు ఒక్కసారిగా దాడికి దిగారు. అంతే కాకుండా ఆమె జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకొని వచ్చి, ఆమె బట్టలు చింపడమే కాకుండా..ఆమె పై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆమె పెంచుకుంటున్న కుక్క ఒక్కసారిగా వారి మీద గట్టిగా అరుస్తూ ఉంది.

Also read: పెళ్లిపీటలు ఎక్కబోతున్న రంగం సినిమా హీరోయిన్‌ ..ఇది నిజమే అంటున్న నెటిజన్లు!

దీంతో చందన్‌ కుక్క మీద దాడి చేయడమే కాకుండా..కుక్క ప్రైవేట్‌ భాగాల్లో ఇనుప రాడ్‌ చొప్పించాడు. దీని గురించి పోలీసులకు తెలిపిన మహిళ నిందితుడ్ని వెంటనే అరెస్ట్‌ చేయాలని కోరింది. దీని గురించి క్యాపిటల్‌ పోలీస్‌ స్టేషన్ ఇన్‌ స్పెక్టర్‌ పద్మనాభ్‌ మాట్లాడుతూ.. ఓ మహిళ ఈ విషయం గురించి ఫిర్యాదు చేసిందని, నిందితుల మీద తీవ్రమైన ఆరోపణలు కూడా చేసిందని తెలిపారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించమని చెప్పారు. నిందితుడిపై త్వరలో చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.

Also read: ఆ హీరోయిన్‌ పెట్టిన పోస్ట్‌ కు అర్థం ఏంటి..బాయ్ ఫ్రెండ్‌ మోసం చేశాడా!

Advertisment
Advertisment
తాజా కథనాలు