Manda Krishna: నో కాంగ్రెస్.. నో బీఅర్ఎస్.. మోదీకి అండగ నిలబడతాం: మందకృష్ణ మాదిగ

ప్రధాని నరేంద్ర మోదీ మాదిగలకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు మందకృష్ణ మాదిగ. నో కాంగ్రెస్.. నో బీఅర్ఎస్.. పార్టీలకతీతంగా మోదీకి అండగ నిలబడతాం అని చెప్పారు మందకృష్ణ. మా జాతి హక్కులను కాపాడాల్సిన బాధ్యత పెద్దన్నగా ప్రధాని నరేంద్ర మోదీదే అని పేర్కొన్నారాయన.

New Update
Manda Krishna: నో కాంగ్రెస్.. నో బీఅర్ఎస్.. మోదీకి అండగ నిలబడతాం: మందకృష్ణ మాదిగ

Manda Krishna Madiga: మాదిగల ఆవేదనలు వినడానికి ప్రధాని మోడీ(PM Modi) ఈ సభకు రావడం అదృష్టంగా భావిస్తున్నామని ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna) అన్నారు. శనివారం నాడు సికింద్రాబాద్‌లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఉద్దేశించి మందకృష్ణ మాదిగ ప్రసంగించారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్న ఆయన.. మాదగలంతా మోదీకి రుణపడి ఉంటామన్నారు. 'నో కాంగ్రెస్.. నో బీఅర్ఎస్.. పార్టీలకతీతంగా మోదీకి అండగ నిలబడతాం.. మా జాతిని, మా జాతి హక్కులను కాపాడాల్సిన బాధ్యత పెద్దన్నగా ప్రధాని నరేంద్ర మోదీదే' అని అన్నారు మందకృష్ణ మాదిగ.

ఈ సభావేదికగా ఎస్సీ సామాజిక వర్గీకరణ అంశంపై, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తీరుపై సంచలన కామెంట్స్ చేశారు మందకృష్ణ మాదిగ. మరి ఆయన ఏం మాట్లాడారో యధావిధంగా తెలుసుకుందాం..

'మాదిగలని చెప్పుకోవడానికి సిగ్గుపడినం. పశువుల కంటే హీనంగా చూసింది ఈ సమాజం. 75 ఏళ్లుగా సమాజoలో బానిసలుగా బ్రతుకుతున్నాం. ఇలాంటి సమాజంలో మాకు అండగా ఉంటానని ముందుకు వచ్చారు నరేంద్ర మోదీ. కాంగ్రెస్ మాటల వరకే పరిమితం అవుతోంది.. ఇచ్చిన మాట కోసం కట్టుబడిన నేతగా మిమ్మల్ని చూస్తున్నాం. దేశానికి పెద్దన్నగా మోదీ ఉన్నారు. పెద్దన్నగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. బీసీ ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పిన దమ్మున్న నేత ప్రధాని మోదీ. ఏ దేశ ప్రధాని కూడా మాదిగ సమావేశాలకు రారు. కానీ పేదల బిడ్డగా వచ్చిన మోదీ మాత్రమే మాదిగల సమావేశానికి వచ్చారు. కాంగ్రెస్ పాలనలో మాదిగలు అణచివేయబడ్డారు. కేసీఆర్ పాలనలో 18 మంది మంత్రులు ఉంటే ఒక్క మాదిగ మంత్రులు లేరు. వెలమలు ఒక్క శాతం లేరు కానీ నలుగురు మంత్రులు ఉన్నారు. ఏడుగురు రెడ్డి మంత్రులు ఉన్నారు. కానీ మాదిగలు ఒక్కరు మాదిగ మంత్రులు లేరు. కర్ణాటకలో కేంద్ర మంత్రులు ఉన్నారు. కర్ణాటకలో వెయ్యి ఓట్లతో మాదిగ బిడ్డ ఓడిపోతే రాజ్యసభలో అవకాశం ఇచ్చి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్లపై ఊరిస్తూ ఊరిస్తూ వచ్చింది. కానీ మోదీ పాలనలో 48 గంటల్లో మహిళా రిజర్వేషన్లు తెచ్చింది బీజేపీ ప్రభుత్వం. సామాజిక వర్గాల గురించి చిత్తశుద్ది లేని మాటలు కాంగ్రెస్, బీఅర్ఎస్ పార్టీలు మాట్లాడుతున్నాయి. దేశంలో అన్ని కమిషన్‌లు మాదిగలు వెనుక బడ్డారనే చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ కమిషన్ వేసింది కానీ.. ఆ కమిషన్ పేరుతోనే మాదిగలను పూర్తిస్థాయిలో మోసం చేసింది. ఈ దేశ సంక్షేమ పథకాలు చిట్ట చివరి వర్గాలకు అందించడంలో గత ప్రభుత్వాలన్నీ విఫలమయ్యాయి.'

'ప్రధాని మోదీ గుండె గట్టిది. మనసు వెన్నపూస లాంటిది. మోదీకి మించిన నాయకుడు దేశంలో లేరు రారు. ఎవరు వేదిక మీదకు వచ్చినా.. మా సమస్యలు పరిష్కారం కావు అనేది మాకు తెలుసు. కానీ, ప్రధాని మోదీపై మాకు పూర్తిగా విశ్వాసం ఉంది. ఎస్సీ వర్గీకరణ అంశంలో న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. మాదిగలంతా మోదీకి రుణపడి ఉంటారు. ఈ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మాదిగలు కూడా ఉన్నారు. పార్టీలకతీతంగా మోదీకి రుణపడి ఉంటాం. మా జాతికి దక్కాల్సిన హక్కుల కోసం 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. నో కాంగ్రెస్.. నో బీఆర్ఎస్.. పార్టీలకతీతంగా మోదీకి అండగా నిలబడతాం. మా జాతిని, మా జాతి హక్కులను కాపాడాల్సిన బాధ్యత పెద్దన్నగా ప్రధాని మోదీదే' అని మందకృష్ణ మాదిగ అన్నారు.

Also Read:

కన్నీరుమున్నీరైన మందకృష్ణ మాదిగ.. హత్తుకుని ఓదార్చిన ప్రధాని మోదీ..

కరీంనగర్‌లో థ్రిల్లింగ్ ఫైట్.. పోటీ చేసే ముగ్గురూ మున్నూరు కాపులే.. ?

Advertisment
Advertisment
తాజా కథనాలు