SpiceJet: గంటన్నరకు పైగా టాయిలెట్ లోనే.. డోర్‌ లాక్‌ అవ్వడంతో జర్నీ మొత్తం అందులోనే!

ముంబై నుంచి బెంగ‌ళూరు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో టాయిలెట్‌ డోర్‌ లాక్‌ అవ్వడంతో ఓ ప్రయాణికుడు గంటన్నర పాటు టాయిలెట్ లోనే జర్నీ చేశాడు. విమానం ల్యాండ్ అయిన తరువాత ఇంజనీర్లు డోర్‌ ఓపెన్‌ చేశారు.

New Update
Spice Jet : స్పైస్‌ జెట్‌ ఎయిర్‌ లైన్స్‌కు బిగ్‌ షాక్‌.. భారీగా పతనమైన షేర్లు.. ఇద్దరు సీనియర్‌ అధికారుల రాజీనామా!

SpiceJet: తొందరగా వెళ్లొచ్చు..సౌకర్యవంతంగా వెళ్లొచ్చు కాద అని విమానం ఎక్కి అందులో ఉన్న టాయిలెట్‌ కి వెళ్తే డోర్‌ లాక్‌ కావడంతో సుమారు గంటన్నర పాటు అందులో ఇరుక్కుపోయి జర్నీ మొత్తం అందులోనే సాగింది. ఈ ఘటన మంగళవారం నాడు ముంబై నుంచి బెంగళూరు వెళ్లే విమానంలో జరిగింది.

డోర్‌ తెరుచుకోకపోవడంతో..

బాధితుడు , విమానాశ్రయాధికారులు తెలిపిన వివరాల ప్రకారం..మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు స్పైస్‌ జెట్‌ విమానం ముంబై నుంచి బెంగళూరుకు బయల్దేరింది. ఈ క్రమంలోనే విమానం టేకాఫ్‌ అయిన తరువాత ఓ ప్రయాణికుడు టాయిలెట్ కు వెళ్లాడు. అయితే అతను లోనికి వెళ్లిన తరువాత మాల్ ఫంక్షన్‌ కారణంగా డోర్‌ తెరుచుకోకపోవడంతో లోపలే ఇరుక్కుపోయాడు.

టాయిలెట్‌ సీటు పై జాగ్రత్తగా..

విషయం గమనించిన ఫ్లైట్ సిబ్బంది కూడా ప్రయత్నాలు చేశారు. కానీ డోర్ తెరుచుకోలేదు. దీంతో చేసేదేమి లేక ఎయిర్‌ హోస్టెస్‌ ఓ కాగితం పై డోర్‌ తెరుచుకోవడం లేదని..విమానం ల్యాండయ్యాక ఇంజనీర్లు వచ్చి డోర్‌ తెరుస్తారని తెలిపింది. మరి కాసేపట్లో బెంగళూరులో ల్యాండ్‌ కాబోతున్నామని..టాయిలెట్‌ సీటు పై జాగ్రత్తగా కూర్చోవాలని, దెబ్బలు తగలకుండా ఉండాలని తెలిపింది.

విమానం కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవ్వగానే ఇంజనీర్లు వచ్చి డోర్‌ పగలగొట్టి లోపల ఇరుక్కున్న ప్రయాణికున్ని బయటకు తీశారు. గంటన్నరకు పైగా టాయిలెట్‌ లోనే ఉండిపోవడంతో ప్రయాణికుడు తీవ్ర ఆందోళనకు గురైనట్లు అధికారులు వివరించారు. దీంతో అతనికి చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వివరించారు.

Also read: హైదరాబాద్ లో మొదలైన విద్యుత్‌ కోతలు..నేటి నుంచి ఎప్పటి వరకు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment