Viral Video: అరేయ్ ఏంట్రా ఇది.. జర చూసుకోవాలి కదా! విమాన సిబ్బంది చేసిన పొరపాటు వల్ల ఓ వ్యక్తి చావు తప్పి కన్ను లొట్ట పోయింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మీరు కూడా దానిని చూడాలా అయితే ఈ కథనం చదివేయండి. By Bhavana 17 May 2024 in ఇంటర్నేషనల్ వైరల్ New Update షేర్ చేయండి Viral Video: ఫ్లైట్ జర్నీలు అంటే చాలా మంది సులభ ప్రయాణంగా పరిగణిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కారణంగా అవి ప్రాణాల మీదకు తీసుకుని వస్తాయి. అలా జరిగిన చిన్న చిన్న పొరపాట్లు వల్ల కొందరి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే విమాన సిబ్బంది ప్రయాణికులు విమానం ఎక్కినప్పటి నుంచి విమానం టేకాఫ్ అయ్యేంత వరకు కూడా సిబ్బంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. అందులో విమాన సిబ్బంది చేసిన పొరపాటు వల్ల ఓ వ్యక్తి చావు తప్పి బతికి బయటపడ్డాడు. ఇండోనేషియాలోని జకార్తా విమానాశ్రయంలో ఉన్న ఎయిర్‌బస్ A320 టేకాఫ్ అవ్వడానికి సిద్దంగా ఉంది. ప్రయాణికులంతా కూడా ఎక్కి కూర్చున్నారు. దీంతో ఎయిర్‌లైన్స్‌కి చెందిన గ్రౌండ్ స్టాఫ్ ప్రయానికులు ఫ్లైట్ ఎక్కే నిచ్చెనను పక్కకు జరిపారు. Shocking video received on WhatsApp - Warning ⚠️ ⛔️ alarming visuals of a staffer falling of a plane #aviation #avgeek #plane #shocking Incident occurred in Indonesia with Transnusa airlines & Jas Airport services @webflite @aviationbrk @AviationWeek @airlinerslive @airlivenet… pic.twitter.com/PtP3K8ZXdj — Sanjay Lazar (@sjlazars) May 15, 2024 ఆ విషయాన్ని గమనించని ఓ ఉద్యోగి మొబైల్‌లో మాట్లాడుకుంటూనే ఫ్లైట్ నుంచి ముందుకొచ్చి కింద పడిపోయాడు.ఈ ఘటన మొత్తం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @sjlazars అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు 1.4 లక్షల మందికి పైగా వీక్షించారు. కాగా, ఈ ఘటనలో గాయపడిన ఉద్యోగి ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. Also read: జోగి రమేష్ కు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది: బోడె ప్రసాద్! #flight #indonesia #jakarta #ladder #staffer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి