Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హత్యకు కుట్ర.. వ్యక్తి అరెస్ట్! ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీని హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఓ వ్యక్తిని పోలీసులు పోలాండ్ లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్ తరుపున కుట్ర పన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. By Bhavana 19 Apr 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీని హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఓ వ్యక్తిని పోలీసులు పోలాండ్ లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్ తరుపున కుట్ర పన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పోలాండ్, ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్లు గురువారం వివరించారు. పావెల్ కే అనే పోలాండ్ జాతీయుడు, రష్యన్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌కి సమాచారం అందించాడని, జెలన్స్కీని హత్య చేయడానికి ప్లాన్ చేశాడని, ఇందుకు రష్యా ప్రత్యేక దళాలు సాయం చేసినట్లు నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి. రష్యన్ ఫెడరేషన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌తో అతను పనిచేశాడు. అంతేకాకుండా ఉక్రెయిన్ యుద్ధంలో నేరుగా పాల్గొన్న రష్యన్ పౌరులతో ఇతడికి సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇతడిపై ఆరోపణలు నిరూపించేందుకు అధికారులు సాక్ష్యాలు సేకరిస్తున్నారు. అనుమానితుడు పోలాండ్ లోని ర్జెస్జో జిసియోంకా విమానాశ్రయంలోని భద్రతా వివరాలను సేకరించి రష్యాకు అందించినట్లు తెలుస్తోంది. జెలన్ స్కీ తన విదేశీ పర్యటనలకు తరుచుగా ఈ విమానాశ్రయం గుండా వెళ్తుంటారు. ఉక్రెయిన్ వెళ్లే విదేశీ అధికారులకు ఇక్కడి నుంచే వెళ్తుంటారు. ఈ కేసు ఉక్రెయిన్, ఉక్రెయిన్ ప్రజలకు మాత్రమే కాకుండా స్వేచ్చా ప్రపంచానికి రష్యా ఒక ముప్పుగా మారిందని ఉక్రెయిన్ చీఫ్ ప్రాసిక్యూటర్ ఆండ్రీ కోస్టిన్ అన్నారు. రష్యా నేర పాలన, ఇతర సార్వభౌమాధికార దేశాల్లో విధ్వంసక కార్యకలాపాలను నిర్వహిస్తోదని అన్నారు. ఫిబ్రవరి 2022లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కి మద్దతుగా పోలాండ్ నిలుస్తోంది. మరోవైపు ఈ యుద్ధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్ స్కీ బలంగా రష్యాను వ్యతిరేకిస్తుండటంతో అతడిని అంతం చేయడానికి రష్యా పథకాలు రూపొందిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. Also read: ప్రారంభమైన తొలిదశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ #murder #zelensky #ukreyin #poland మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి