Mamata benarjee: బీజేపీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌: మమతా బెనర్జీ

బీజేపీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌ అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. తమ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని కేంద్రం ఆపేస్తోందంటూ ఆరోపించారు. సంక్షేమ పథకాలక కోసం వెంటనే నిధులు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.

New Update
Mamata benarjee: బీజేపీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌: మమతా బెనర్జీ

పార్లమెంటులో ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎంసీ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అంటూ పేర్కొన్నారు. తమ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని కేంద్రం ఆపేస్తోందంటూ ఆరోపించారు. కోల్‌కతాలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు.

Also read: అలాంటి వాళ్లు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవడం మంచిందే: రాహుల్ గాంధీ

మేమెందుకు బాధ్యత తీసుకోవాలి 

పలు సామాజిక సంక్షేమ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. 2011లో తమ ప్రభుత్వం మొదటిసారిగా అధికారం చేపట్టినప్పటి నుంచి.. కేంద్రం నిధులను ఎలా వినియోగించింది అనే పత్రాలను సమర్పించినట్లు దీదీ తెలిపారు. రాష్ట్రంలో మేము అధికారంలోకి రాకముందు.. వామపక్ష ప్రభుత్వ పాలనలో జరిగిన దానికి తామేందుకు బాధ్యత వహించాలంటూ మమత ప్రశ్నలు సంధించారు.

బకాయిలు నిలిపివేసిన కేంద్రం 

అయితే పశ్చిమ బెంగాల్‌కు రావాల్సిన బకాయిలను కేంద్రం నిలిపివేయడంతో ఇందుకు నిరసనగా కోల్‌కతాలో ధర్నా చేశారు. అంతకుముందు మమతా.. డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం టీఎంసీ పార్టీ నేతలతో కలిసి మైదాన్ ప్రాంతంలో నిరసన చేశారు.

Also Read: తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు కర్నాటక కోర్టు సమన్లు..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు