Watch Video : గాల్లో రెండు హెలికాప్టర్లు ఢీ.. 10 మంది మృతి

మలేషియాలో రెండు హెలికాప్టర్లు గాలిలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది సిబ్బంది మృతి చెందారు. మలేషియన్ నేవి వేడుకల కోసం హెలికాప్టర్లు రిహార్సల్ ప్రదర్శన చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

New Update
Watch Video : గాల్లో రెండు హెలికాప్టర్లు ఢీ.. 10 మంది మృతి

Two Helicopters Crash :  మలేషియా(Malesia) లో ఘోర ప్రమాదం(Accident) జరిగింది. రెండు హెలికాప్టర్లు గాలిలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది సిబ్బంది మృతి చెందారు. రాయల్ మలేషియన్ నేవి వేడుకల కోసం హెలికాప్టర్లు రిహార్సల్(Helicopters Rehearsal) ప్రదర్శన చేస్తుండగా.. అందులో ప్రమాదవశాత్తు రెండు నేవీ హెలికాప్టర్ల రెక్కలు ఒకదానికొటి తాకాయి. దీంతో క్షణాల్లోనే ఆ రెండు హెలికాప్టర్లు కుప్పకూలాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Also Read: చైనాలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు..

లుముట్‌లోని రాయల్ మలేషియన్ నేవీ(RMN) బేస్ దగ్గర ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. M503-3 మారిటైమ్ ఆపరేషన్స్ హెలికాప్టర్(HOM) లో ఏడుగురు సిబ్బంది ఉండగా.. మరొక M502-6 హెలికాప్టర్‌లో ముగ్గురు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. మే నెలలో 3 - 5వ తేదీల మధ్య జరగనున్న నేవీ డే వేడుకల సందర్భంగా ఈ హెలికాప్టర్లు శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.

Also Read: ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం.. మీరు బుక్స్ చదువుతారా

Advertisment
Advertisment
తాజా కథనాలు