/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/2-7-jpg.webp)
Malaika Arora: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది. నెట్టింట ఎప్పటికప్పుడూ యాక్టివ్ గా ఉండే నటి.. సెమీ న్యూడ్ ఫొటో, వీడియోలతోపాటు యోగా ఆసనాలకు సంబంధించిన విభిన్న ఫోజులతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. అంతేకాదు ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోల్డ్ ఆన్సర్ చేసే నటి.. తాజాగా కొడుకు అర్హాన్ తోనే పబ్లిక్ గా శృంగారం గురించి డిస్కషన్ చేసి నెటిజన్లకు షాక్ ఇచ్చింది.
View this post on Instagram
'ట్రూత్ ఆర్ స్పైసీ'పేరుతో షో..
ఈ మేరకు మలైకా కొడుకు అర్హాన్ ఖాన్ ‘దమ్ బిర్యానీ’ పేరుతో ఓ పాడ్‌కాస్ట్ షో నిర్వహిస్తుండగా తాజాగా 'ట్రూత్ ఆర్ స్పైసీ'పేరుతో షో నిర్వహించగా మలైకా హాజరైంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకోగా.. ఇద్దరూ తగ్గేదేలేదన్నట్లు ఓపెన్ క్వశ్చన్ వేసుకున్నారు. ఇందులో భాగంగానే మొదట మలైకా తన కొడుకును 'వర్జినిటీ ఎప్పుడు కొల్పోయావ్' అని డైరెక్ట్ అడిగి షాక్ ఇచ్చింది. దీంతో వెంటనే 'నువ్వు (social climber) సోషల్ క్లైంబర్‌వా' అని కొడుకు అడిగాడు. ఆమె వెంటనే దాన్ని ఖండించింది. ఇక ఈ తర్వాత ‘నా తదుపరి ప్రశ్న.. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అని అర్హాన్ అడగటం విశేషం. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.. తన కన్యత్వాన్ని ఎప్పుడు పోగొట్టుకున్నాడని కొడుకును అడగడం అనేది తల్లిదండ్రులు చెప్పే అత్యంత అసహ్యకరమైన విషయం. అంటూ తిట్టి పోస్తున్నారు.
ఇది కూడా చదవండి: Angry Rantman: యూట్యూబర్ యాంగ్రీ రాంట్‌మాన్ ఇక లేరు.. ఎమోషనల్ పోస్ట్ వైరల్ !
ఇక మలైకా, తన భర్త అర్బాజ్‌తో వివాహమైన 19 సంవత్సరాల తర్వాత విడిపోయింది. వీరు 2017లో విడాకులు తీసుకున్నారు. అర్బాజ్ గత ఏడాది డిసెంబర్‌లో మేకప్ ఆర్టిస్ట్ షౌరా ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. ఇక మరోవైపు, మలైకా అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది.