Bihar Politics : బీహార్‌లో కీలక మలుపు.. నితీశ్ సర్కార్ సంచలన నిర్ణయం

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇవాళ రాజీనామా చేయడం గ్యారంటీ అని చెబుతున్నారు. ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో నితీశ్ చర్చలు కూడా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 100మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను బదిలీ చేసింది.

New Update
Bihar Politics : బీహార్‌లో కీలక మలుపు.. నితీశ్ సర్కార్ సంచలన నిర్ణయం

Police Reshuffle In Patna : 100 బీహార్‌(Bihar) లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వారం రోజులుగా వస్తున్న గాసిప్స్‌కు ఇవాళ తెరపడనున్నాయి. నితీశ్ కుమార్(Nitish Kumar) మరి కాసేపట్లో రాజీనామా చేస్తారని చెబుతున్నారు. ఇది కాయం అని సంకేతాలిస్తూ నితీశ్ ప్రభుత్వం మరో కీలక నిర్నయాన్ని ప్రకటించింది. బీహార్‌లోని 100మంది ఆల్ ఇండియా సర్వీసు అధికారులను బదీలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ పరిపాలన శాఖ ఈ ఉత్తర్వులను ఇచ్చింది.

Also Read : Nitish Kumar : కూటమిలో కల్లోలం.. నితీశ్ యూటర్న్.. లెక్కలివే.

బీహార్‌లో మొత్తం 22మంది ఐఏఎస్, 79మంది ఐపీఎస్, 45 మంది గ్రూప్ 1 స్థాయి అధికారులను నితీశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో 5గురు జిల్లా కలెక్టర్లు, 17 మంది సూపరెండెంట్ ఆఫ్ పోలీసులు ఉన్నారు. ఇక పాట్నా డీఎం చంద్రశేఖర్ సింగ్‌ను సీఎంవో స్పెషల్ సెక్రటరీగా నియమించారు.

నిన్న, మొన్నటి వరకు ఇండియా కూటమి(Alliance of India) తో చెట్టపట్టాలేసుకుని తిరిగి, మీటింగ్‌లకు హాజరయి… కూటమితోనే ఉంటాను అని సంకేతాలిచ్చిన నితీశ్ ఇప్పుడు రంగు మార్చబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వారం రోజులుగా ఇవి హల్ చల్ చేస్తున్నా… నిన్నటి నుంచి మరింత ఊపందుకున్నాయి. వస్తున్న వార్తల ప్రకారం నితీశ్ కుమార్ ఎన్డేయే కూటమిలోకి చేరబోతున్నారని… మరోసారి సీఎం అవడం ఖాయమని తెలుస్తోంది. నితీశ్‌ కుమార్‌ కోసం రెండు కూటమిలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. ఆయనను ఒప్పించేందుకు ఆర్జేడీ-కాంగ్రెస్(RJD-Congress) చేసిన ప్రయత్నాలు ఏవీ సక్సెస్ అవ్వలేదు. కానీ ఆర్జేడీ(RJD) మాత్రం లొంగిపోయే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపై నితీశ్ ఎన్డీయే(NDA) లోకి రావడం దాదాపు ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం పైపై లాంఛనాలు మాత్రమే చేయాల్సి ఉందని సమాచారం.

Also Read: Hyderabad Accident : హైదరాబాద్‌ పాతబస్తీలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisment
Advertisment
తాజా కథనాలు