Mahesh : ఆ బీడీల్లో ఉన్నది పొగాకు కాదు.. క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు 'గుంటూరు కారం'లో తాగిన బీడీల్లో పోగాకు లేదని మహేష్ తెలిపారు. 'నేను స్మోకింగ్ ప్రోత్సహించను. అది ఆయుర్వేదిక్ బీడీ. లవంగం ఆకులతో తయారు చేశారు. మొదట నాకు నిజమైన బీడీ ఇచ్చారు. అది కాల్చినప్పుడు మైగ్రేన్ వచ్చి తల తిరిగిపోయేది' అన్నారు. By srinivas 16 Jan 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Mahesh babu : టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). ఇటీవల విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. ముఖ్యంగా ఈ మూవీలో మహేష్ ను సరికొత్త యాంగిల్స్ లో చూపించి అభిమానులకు పిచ్చెక్కించాడు త్రివిక్రమ్. అంతేకాదు శ్రీలీల (Sree leela) ఫర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్ అని చెప్పుకోవాలి. అయితే ఈ మూవీలో బీడీలు తాగుతూ కనిపించిన మహేశ్.. తాజా ఇంటర్వ్యూలో అందులో పొగాకు లేదంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అది ఆయుర్వేదిక్ బీడీ.. ఈ మేరకు మహేష్ మాట్లాడుతూ.. గత చిత్రాలకు భిన్నంగా ఇందులో డ్యాన్స్ మూమెంట్స్ ఉండాలని ముందు నుంచే తానూ, దర్శకుడు త్రివిక్రమ్ అనుకున్నామని చెప్పారు. అందుకు తగినట్లుగానే రమణ (Mahesh babu) పాత్రకు అనుగుణంగా పాటలను డిజైన్ చేసుకున్నానన్నారు. 'నేను స్మోకింగ్‌ను అస్సలు ప్రోత్సాహించను. సినిమాలో బీడీ కాల్చడం వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు చెబుతా. అది ఒక ఆయుర్వేదిక్ బీడీ. లవంగం ఆకులతో తయారు చేశారు. మొదట నాకు నిజమైన బీడీ ఇచ్చారు. అది కాల్చినప్పుడు మైగ్రేన్ వచ్చి తల తిరిగిపోయేది. ఆ నొప్పి భరిస్తూ షూటింగ్‌లో పాల్గొనడం నా వల్ల కావటం లేదని త్రివిక్రమ్‌కు చెప్పా. ఆ మరుసటి రోజు నుంచి ఆయుర్వేదిక్ బీడీలు తయారు చేసి సెట్‌వాళ్లు తీసుకొచ్చారు. అందులో ఎలాంటి టుబాకో ఉండదు. మింట్ ఫ్లేవర్‌లో ఉండటంతో సౌకర్యవంతంగా షూటింగ్ చేసేందుకు వీలైంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా కాల్చేశా' అని వివరించాడు. ఇది కూడా చదవండి : బచ్చన్ ఇంట్లో గొడవలు.. ఐశ్వర్య-అభిషేక్ విడాకులు ఫిక్స్? ప్రత్యేకంగా ఉండాలని.. అలగే ఈ చిత్రలో రెడ్ షర్ట్ వేసుకున్న స్టిల్‌ను ఫస్ట్‌లుక్‌గా విడుదల చేయగా.. ఆ తర్వాత పది రోజుల పాటు ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఆ షర్ట్ అవుట్ ఆఫ్ ఆర్డర్ చూపించిందని చాలా మంది నాతో చెప్పారు. అప్పటి నుంచి ప్రతిదీ ప్రత్యేకంగా ఉండాలని అనుకున్నాం. అలాగే డ్యాన్స్‌ల విషయంలోనూ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా చేయాలనుకున్నాం. ‘పోకిరి’లో ‘దేవుడా దేవుడా’ సాంగ్‌లో నేను చూపించిన యాటిట్యూడ్ కావాలని త్రివిక్రమ్ అడిగారు. శేఖర్ మాస్టర్ కూడా అందుకు తగిన విధంగా స్టెప్స్ డిజైన్ చేయడంతో అదే యాటిట్యూడ్‌తో సాంగ్స్ తీయడం మొదలు పెట్టామని తెలిపారు. ‘కుర్చీ పాట’ టెన్స్ న్.. ఇక ‘కుర్చీ పాట’ డిసెంబరు 22న షూటింగ్ మొదలు పెట్టినట్లు చెప్పిన ఆయన.. ఈ పాటకోసం చాలా టెన్షన్‌గా అనిపించిందన్నారు. ఆ పాటను తెరపై చూసిన తర్వాత ‘నేనేనా’ అనిపించింది. ‘ఓ మై బేబీ’ పాటను కూడా కేరళలో తీద్దామని అనుకున్నాం. నాకు, శ్రీలీలకు నాలుగైదు డ్రెస్‌లను కూడా రెడీ చేశారు. మరుసటి రోజు షూటింగ్‌కు వెళ్దామని సిద్ధమవుతుండగా, చివరి నిమిషంలో వద్దనుకున్నాం. రమణ పాత్రను దృష్టిలో పెట్టుకుని రియల్‌టైమ్‌లో కాస్ట్యూమ్స్, పాటలను తీశాం. దీంతో సింగిల్ డ్రెస్‌లో పాట మొత్తం కనిపించినందుకు శ్రీలీల ఫీల్ అయింది. ఆ సాంగ్ కోసం తీసి పెట్టిన ఆరు డ్రెస్‌లను రీల్స్ కోసం వాడేసుకుంది’ అంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు మహేష్. #mahesh-babu #guntur-kaaram #beedi #ayurvedic మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి