Guntur Kaaram: ఓటీటీలో గుంటూరు కారం ఘాటు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. జనవరి 12 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఫిబ్రవరి 9న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమయ్యే అవకాశం ఉందని టాక్ తెలుస్తోంది.

New Update
Guntur Kaaram: ఓటీటీలో గుంటూరు కారం ఘాటు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Guntur Kaaram OTT Release: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu), శ్రీలీల, మీనాక్షి చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. భారీ అంచనాల నడుమ జనవరి 12 న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. రమణ పాత్రలో ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్ లో కనిపించారు మహేష్ బాబు. మదర్ సెంటి మెంట్, మాస్ యాక్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు మాస్ డాన్స్, ఫైట్స్, పర్ఫామెన్స్ తో దుమ్ములేపారు. సినిమాలో మహేష్ బాబు పాత్ర హైలెట్ గా ఉన్నప్పటికీ.. ఓవరాల్ టాక్ మాత్రం మిక్స్డ్ గా వినిపించింది. థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించిన గుంటూరు కారం ఓటీటీలో సందడి చేయడానికి సిద్దమవుతుంది.

గుంటూరు కారం ఓటీటీ రిలీజ్

తాజాగా దీనికి సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) గుంటూరు కారం స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. సినిమా విడుదలైన 28 రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కు తెచ్చేలా మేకర్స్ తో నెట్ ఫ్లిక్స్ ఒప్పందం ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో గుంటూరు కారం స్ట్రీమింగ్ డేట్ పై అంచనాలు వెలువడుతున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి రెండవ వారంలో 9 న ఓటీటీలో వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. ఇది సాధ్యం కాకపోతే 16న స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

Also Read: Anudeep Movie : అనుదీప్ మూవీలో “సప్త సాగరాలు దాటి” .. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా

publive-image

గుంటూరు కారం చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రీలీల (Sreeleela) కథానాయికలుగా నటించారు. సినిమాలో శ్రీలీల మాస్ డాన్స్ తో విజిల్స్ వేయించారు. రమ్యకృష్ణ మహేష్ బాబు తల్లిగా ప్రేక్షకులను మెప్పించారు. జయరాం, జగపతిబాబు, మురళి శర్మ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరి రావు, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు.

Also Read: ఆ మూడు నెలలు మెగా ఫ్యాన్స్ కు పండగే.. వరుసగా మెగా సినిమాల సందడి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment