MAHADEV BETTING APP:జ్యూస్ షాప్, టైర్ షాప్...మహదేవ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల బ్యాక్ గ్రౌండ్ ఇదీ.

మహదేవ బెట్టింగ్ యాప్....ప్రస్తుతం బాలీవుడ్ ను షేక్ చేస్తున్న మ్యాటర్. ఈ మనీల్యాండరింగ్ కుంభకోణం కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. దాంతో పాటూ విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ యాప్ ను ప్రమోట్ చేసింది సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ అనే ఇద్దరు బీహార్ యువకులు. అసలు వీళ్ళు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చేవారు? గతంలో ఏం చేశారు అని చూస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

New Update
MAHADEV BETTING APP:జ్యూస్ షాప్, టైర్ షాప్...మహదేవ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల బ్యాక్ గ్రౌండ్ ఇదీ.

Mahadev Betting App: మహదేవ బెట్టింగ్ యాప్ ను క్రియేట్ చేసిన సౌరభ్ చంద్రకర్ (Sourabh Chandrakar), రవి ఉప్పల్ (Ravi Uppal) ఇద్దరూ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బిలాయ్ కు చెందిన వారు. యాప్ క్రియేట్ చేయకముందు సౌరభ్ జ్యూస్ షాప్ నిర్వహిస్తూ ఉండేవాడు. రవికి టైర్ షాప్ ఉండేది. వీరిద్దరికీ గ్యాంబ్లింగ్ అంటే చాలా ఇష్టమట. దానికి బానిసలైన తమ వ్యాపారాలను వదిలేసి దుబాయ్ కు వెళ్ళిపోయారు. అక్కడే వీళ్ళ జీవితాలు ఒక ములుపు తీసుకున్నాయి. రెండు, మూడు ఏళ్ళల్లో ఏకంగా 5వేల కోట్లు సంపాదించే రేంజ్ కు తీసుకువెళ్లిపోయింది.

దుబాయ్ లో సౌరభ్, రవిలకు క్ష షేక్, మరో పాకిస్తానీ యువకుడితో పరిచయం అయింది. వారి సాయంతోనే మహదేవ బెట్టింగ్ యాప్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత భారత్‌లో వీరి తరుఫున వ్యాపారాలు నిర్వహించేందుకు 4వేల మంది ప్యానెల్ ఆపరేటర్లను నియమించుకున్నారు. ఒక్కో ఆపరేటర్‌కు 200 మంది కస్టమర్లు ఉన్నారు. అంటే ఈ లెక్క ప్రకారం మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా రోజుకు 200 కోట్ల రూపాయిలు చేతులు మారతాయి. ఈ డబ్బులతోనే సౌరభ్, రవిలు దుబాయ్ లో తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోగలిగారు. మహదేవ్ ఆన్‌లైన్ బుక్‌ను 70:30 లాభ నిష్పత్తి ప్రకారం యూఏఈలోని కార్యాలయం నుంచి ఫ్రాంఛైజీ ద్వారా నడిపారు. వినియోగదారులను ఆకర్షించడానికి, యాప్, వెబ్ సైట్ ప్రచారానికి భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున అమౌంట్ ఖర్చు చేశారు. దీనికి కోసమే బాలీవుడ్ నటులు రణబీర్ (Ranbir Kapoor), శ్రద్ధాకపూర్ (Shraddha Kapoor) లాంటి వారితో ప్రచారం చేయించారు. అలాగే వాళ్ళ కార్యక్రమాల్లో యాప్‌కు సంబంధించి ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఇవి చేసినందుకు బాలీవుడ్ యాక్టర్స్ కు పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.

మహదేవ బెట్టింగ్ యాప్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు 72 కేసులు నమోదు చేయగా.. ఢిల్లీ, ముంబయి తదితర ప్రాంతాలలో 449 మంది అనుమానితులను అరెస్టు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా డజనుకు పైగా వ్యక్తులను ప్రశ్నించింది. ఆగస్టు చివరి వారం నుంచి కేసుపై దర్యాప్తును ఈడీ ఉధృతం చేసింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే యాప్ ఓనర్ సౌరబ్ చంద్రకర్‌కు రీసెంట్ గా పెళ్ళి అయింది. అతను దీని కోసం ఏకంగా 200 కోట్లు ఖర్చు పెట్టాడుట. ఈ వేడుకల్లో దాదాపు 17మంది బాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొన్నట్టు దర్యాప్తులో తేలింది. టైగర్ ష్రాఫ్ (Tiger shroff), సన్నీ లియోన్ (sunny Leone), నేహా కక్కర్, అతిఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్, అలీ అస్గర్, విశాల్ దడ్లానీ, ఎల్లి అవ్రామ్, భారతీ సింగ్, భాగ్యశ్రీ, కృతి కర్బందా, నుష్రత్ భరుచ్చా, కృష్ణ అభిషేక్, గాయకులు సులీ, నేహా కక్కర్ తదితరులు ఈ వేడుకలకు హాజరైనట్టు గుర్తించారు. ఈడీ చేతికి చిక్కిన సాక్ష్యాలను బట్టి ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి హవాలా ద్వారా రూ. 112 కోట్లు, హోటల్ బుకింగ్‌ల కోసం రూ. 42 కోట్లు చెల్లించారు. అంతేకాదు వివాహానికి కుటుంబ సభ్యులను నాగ్‌పూర్ నుంచి దుబాయ్‌కి ఛార్టెడ్ ఫ్లైట్లలో తీసుకెళ్లినట్టు తేలింది. అలాగే, ముంబై నుంచి వెడ్డింగ్ ప్లానర్‌లు, డ్యాన్సర్‌లు, డెకరేటర్‌లు మొదలైన వారిని తీసుకెళ్లారని తెలిసింది.

publive-image BETTING APP

కొత్త వినియోగదారులను చేర్చుకొని యూజర్ ఐడీలను క్రియేట్‌చేసి, బినామీ బ్యాంకు ఖాతాల లేయర్డ్ వెబ్ ద్వారా డబ్బులను మళ్లించేందుకు మహాదేవ్ బుక్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తోందనేది ఈడీ ప్రధాన ఆరోపణ. బెట్టింగ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని హవాలా ద్వారా ఆఫ్‌షోర్ ఖాతాలకు తరలిస్తోందని ఈడీ తెలిపింది.

బాలీవుడ్‌ చుట్టూ యాప్ ఉచ్చు...

మహదేవ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ ముందు హాజరు కావాలని ఈరోజు నటి శ్రద్ధాకపూర్‌కు సమస్లు జారీ చేసింది. ఇప్పటికే ఈ యాప్ విషయమై రణబీర్ కపూర్, హాస్య నటుడు కపిల్ శర్మ, హీనాఖాన్, మ్యూమా ఖురేషీలకు కూడా సమస్లు అందాయి. రణబీర్ కపూర్ ద్యాప్తుకు హాజరు కావడానికి సమయం కోరారు. రెండు వారాల తర్వాత హాజరు అవుతానని అడిగారు. మిగతా వారిని కూడా వేర్వేరు తేదీల్లో ప్రశ్నిస్తామని అధికారులుచెబుతున్నారు. ఈ కేసులో 14 లేదా 15 మంది సెలబ్రీల పాత్రల ఉందని ఈడీ అనుమానిస్తోంది. మిగతా వారికి కూడా త్వరలోనే సమన్లు జారీ చేస్తారని తెలుస్తోంది.

Also Read: వన్డే ప్రపంచకప్‌లో తొలిమ్యాచ్‌లోనే భారత్‌కు షాక్.

#bollywood #mahadev-betting-app-owner #mahadev-betting-app-scam #ed #betting #app #mahadev-betting-app-case #mahadev #mahadev-betting-app
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

కల్తీ కల్లు కలకలం.. 58 మందికి తీవ్ర అస్వస్థత...

కల్తీ కల్లు కలకలం.. 58 మందికి తీవ్ర అస్వస్థత

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కల్తీ కల్లు తాగి మతిస్థిమితం కోల్పోవడంతో పాటు వింతగా ప్రవర్తించారు. దీంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.

New Update
Kamareddy issues

Kamareddy issues Photograph: (Kamareddy issues)

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగిన వారంతా ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ కల్తీ కల్లు వల్ల ఒక్కసారిగా మతిస్థిమితం కోల్పోయారు. వింతగా ప్రవర్తించడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

కల్తీ కల్లు తాగిన వారి పరిస్థితి విషమం..

ఈ కల్తీ కల్లు తాగిన వారిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణానికి వెళ్లి శాంపిల్స్ సేకరించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఆ కల్లు దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేయాలని అధికారులను సబ్ కలెక్టర్ వెల్లడించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిని కల్లు దుకాణాలను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కల్తీ కల్లు వల్ల ఇంకా ఎందరు ప్రాణాలు కోల్పోవాలని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వాటిని పూర్తిగా క్లోజ్ చేయాలని, ఇలాంటి వాటికి అసలు పర్మిషన్లు ఇవ్వకూడదని స్థానికులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

Advertisment
Advertisment
Advertisment