దేని ఆధారంగా సనాతన ధర్మంపై కామెంట్స్ చేశారు.. ఉదయనిధికి హైకోర్టు ప్రశ్నలు

ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కాగా ఈ కేసుపై బుధవారం మద్రాసు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో దేని ఆధారంగా సనాతన ధర్మంపై కామెంట్స్ చేశారు? దానిని అర్థం చేసుకోవడానికి ఏలాంటి పరిశోధనలు చేపట్టారని హైకోర్టు ప్రశ్నించింది.

New Update
దేని ఆధారంగా సనాతన ధర్మంపై కామెంట్స్ చేశారు.. ఉదయనిధికి హైకోర్టు ప్రశ్నలు

తమిళనాడుకు చెందిన నటుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కాగా ఈ కేసుపై బుధవారం మద్రాసు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో  దేని ఆధారంగా సనాతన ధర్మంపై కామెంట్స్ చేశారని, దానిని అర్థం చేసుకోవడానికి ఏలాంటి పరిశోధనలు చేశారని ఉదయనిధిని హైకోర్టు పలు ప్రశ్నలు అడిగింది.

Also read :అసోం సీఎంకు షాక్ ఇచ్చిన ఈసీ.. దానిపై క్లారిటీ ఇవ్వాలని నోటీసులు

అయితే దీనిపై ఉదయనిధి తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది పి విల్సన్ పూర్తి వివరణ ఇచ్చారు. ఈ మేరకు కుల వ్యవస్థకు కారణమైన వర్ణాశ్రమ ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిస్తూ డాక్టర్ అంబేద్కర్ చేసిన ప్రసంగాల ఆధారంగానే ఉదయనిధి మాట్లాడినట్లు చెప్పారు. అలాగే ఈ అంశంపై అంబేద్కర్ చేసిన ప్రసంగాలను 1902 నుంచి 1937 మధ్యకాలంలో బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రచురించిందని విల్సన్ కోర్టుకు తెలిపారు. మనుస్మృతిలో ఉన్న వర్ణాశ్రమ ధర్మం వంటి సూత్రాలను రూపుమాపాలని ఉదయనిధి చెప్పారని, హిందూమతానికి అతను వ్యతిరేకంగా మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు మతాన్ని కించపరిచే ఆలోచన ఆయనకు లేదని విల్సన్ తెలిపారు.

ఇదిలావుంటే.. స్టాలిన్‌పై మూడు పిటిషన్లు వేసిన 'హిందూ మున్నాని'సంస్థ కార్యకర్తల తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. సనాతన ధర్మం, హిందూయిజం ఒకటే అన్నారు. అయితే దీనికి వెంటనే కౌంటర్ ఇచ్చిన విల్సన్.. మనదేశంలో కుల వ్యవస్థ వేళ్లూనుకుపోయింది. భారత రాష్ట్రపతి కూడా దానికి మినహాయింపు కాదు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన భార్య దళితులు అనే కారణంతో ఆలయ గర్భగుడిలోకి రాకుండా అడ్డుకున్నారు' అంటూ కోర్టుకు గుర్తు చేశారు. చివరగా స్టాలిన్ చేసిన ప్రసంగం కాపీని తమకు అప్పగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు