ప్రముఖ నటికి షాకిచ్చిన కోర్టు..15 రోజుల్లో లొంగిపోవాల్సిందే అంటూ ఆదేశాలు! ఈఎస్‌ఐ లు చెల్లించడంలో జయప్రదతో పాటు, రామ్ కుమార్, రాజ్ బాబు ముగ్గురు కూడా అవకతవకలకు పాల్పడినట్లు కేసు నమోదు అయ్యింది. దీని గురించి ఎగ్మూర్ కోర్టులో కేసు దాఖలైంది. ఆ సమయంలో జయప్రదతో పాటు మిగిలిన ఇద్దరికి కూడా ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ ఆగస్టులో తీర్పును చెప్పింది. By Bhavana 21 Oct 2023 in సినిమా క్రైం New Update షేర్ చేయండి ప్రముఖ నటి జయప్రదను 15 రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలంటూ మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా 20 లక్షల రూపాయలను కూడా డిపాజిట్ చేయాలని తీర్పునిచ్చింది. ఉద్యోగులకు ఈఎస్ ఐ చెల్లింపులో అవకతవకల కేసులో జయప్రద మీద కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలంటూ నటి కోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన తరువాత మద్రాసు హైకోర్టు పై విధంగా తీర్పునిచ్చింది. కొంతకాలం క్రితం జయప్రద చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజ్ బాబు అనే వ్యక్తులతో కలిసి తమిళనాడులోని అన్నాసాలైలో ఓ థియేటర్ ను ఏర్పాటు చేసి నిర్వహించారు. ఆ థియేటర్ లో చాలా మంది ఉద్యోగులు పని చేసేవారు. వారందరికీ ఈఎస్‌ఐ లు చెల్లించడంలో జయప్రదతో పాటు, రామ్ కుమార్, రాజ్ బాబు ముగ్గురు కూడా అవకతవకలకు పాల్పడినట్లు కేసు నమోదు అయ్యింది. దీని గురించి ఎగ్మూర్ కోర్టులో కేసు దాఖలైంది. ఆ సమయంలో జయప్రదతో పాటు మిగిలిన ఇద్దరికి కూడా ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ ఆగస్టులో తీర్పును చెప్పింది. Also read: నేను అక్కడి నుంచే పోటీ చేస్తా…బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మీ ప్రత్యేక ఇంటర్వ్యూ…!! తన మీద నమోదైన కేసుతో పాటు కోర్టు తెలిపిన తీర్పును సవాల్ చేస్తూ నటి మద్రాస్ హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. పిటిషన్ పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈఎస్‌ఐ బాకీ కింద రూ. 37.28 లక్షలు చెల్లించాలని ఆమెను కోరారు. దీని గురించి నటిని చెల్లించడం వీలు అవుతుందా? లేదా అని కూడా ప్రశ్నించారు. ఈ విషయం గురించి సమాధానం చెప్పాలని న్యాయమూర్తి నటిని అడిగారు. దీంతో జయప్రద రూ. 20 లక్షలు చెల్లిస్తానని తెలిపారు. దీని గురించి ఈఎస్‌ఐ తరుఫున వాదించే న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం శుక్రవారం నాడు జయప్రద పిటిషన్ కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. అంతే కాకుండా ఆమెను 15 రోజుల్లోపు లొంగిపోవడమే కాకుండా వెంటనే రూ.20 లక్షలు కూడా డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. #high-court #crime #cinema #jayaprada #madras మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి