Madhuri: దువ్వాడ ఆలనా పాలనా నాదే.. మాధురి మరో సంచలన వీడియో!

దువ్వాడ శ్రీనివాస్‌కు తనతో ప్రాణహాని ఉందంటూ వాణి చేసిన వ్యాఖ్యలను దివ్వల మాధురి ఖండించింది. వాణితోనే శ్రీనివాస్ ప్రాణానికి ప్రమాదం ఉందంటూ వీడియో రిలీజ్ చేసింది. రెండేళ్లనుంచి ఆయన ఆలనా పాలనా చూస్తున్న తాను ఎందుకు హాని తలపెడతానని ప్రశ్నించింది.

New Update
Madhuri: దువ్వాడ ఆలనా పాలనా నాదే.. మాధురి మరో సంచలన వీడియో!

Duvvada issue: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురి మరో సంచలన వీడియో రిలీజ్ చేసింది. ఆదివారంనాడు పది రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించిన మాధురి.. వాణి ఆరోపణలపై మరోసారి స్పందించింది. తన భర్తను మాధురి చంపేస్తుందంటూ వాణి చేసిన కామెంట్స్‌కు కౌంటర్ గా పలు సంఘటనలు బయటపెట్టింది. గత రెండేళ్లుగా శ్రీనివాస్ ఆలనా పాలనా చూసుకుంటున్న తాను ఎందుకు చంపేస్తానని, నిజానికి దువ్వాడకు వాణితోనే ప్రాణహానీ ఉందని మాధురి చెప్పింది.

దువ్వాడ రోడ్డున పడితే ఆదరించి..
అలాగే ఇప్పుడు మాధురి ఉంటున్న ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనే వాణి డిమాండ్ పై రియాక్ట్ అయిన మాధురి.. తనకు రెండు కోట్ల రూపాయలు ఇస్తే ఇప్పుడే వెళ్లిపోతానని చెప్పింది. ఆ ఇళ్లు నిర్మాణం కోసం తాను రెండు కోట్లు ఇచ్చానని, ఇందుకు సంబంధించిన ఫ్రూప్స్ కూడా చూపించింది. అలాగే వాణికి ఇంధ్రభవనం కట్టించి, అన్ని సదుపాయాలు కల్పించిన దువ్వాడ రోడ్డున పడితే తాను ఆదరించి సొంత మనిషిలా చూసుకున్నానని తెలిపింది. 'ఆ ఇల్లు నాది. నీకు ఆ ఇంటి పై హక్కు ఏంటి. రెండేళ్లుగా శ్రీనివాస్ కి అండగా వున్నప్పుడు లేని ప్రాణహాని ఇప్పుడు ఎవరి నుంచి వచ్చింది. వాణీతోనే దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణ హాని ఉంది' అంటూ మాధురి చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: YS Sharmila: జగనన్నకు షర్మిల మరో షాక్.. రాఖీ సందర్భంగా ఏమని ట్వీట్ చేశారంటే?

ఇదిలా ఉంటే.. దువ్వాడ వాణి మీడియాతో మాట్లాడుతూ.. దివ్వల మాధురి వలన దువ్వాడ శ్రీను ప్రాణహాని ఉందని ఆరోపించింది. 'నాకు మా పిల్లలకి ప్రాణహాని ఉంది. పోలీస్ భద్రత కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకుని తక్షణమే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నా'అంటూ దువ్వాడ వాణి వాపోయింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు