Lunar Eclipse : చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఈ 4 రాశులు జాగ్రత్తగా ఉండాలి! ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం నేడు. ఈ రోజు మీన, కుంభ, కర్కాటక, మేష రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరు ఉద్యోగంలో ఆటంకాలు, బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్‌తో తీవ్రమైన గొడవ జరగవచ్చు. అందుకే అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. By Vijaya Nimma 25 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Lunar Eclipse Today: మార్చి 25న(ఇవాళ) హోలీ(Holi) రోజున చంద్రగ్రహణం(Lunar Eclipse) ఏర్పడింది. ఈ ఏడాది ఇది తొలి చంద్రగ్రహణం. జ్యోతిషశాస్త్రం(Astrology) ప్రకారం ఈ గ్రహణం హోలీ పండుగపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎందుకంటే ఇది పెనుంబ్రాల్ చంద్రగ్రహణం. జ్యోతిషశాస్త్రంలో, ఈ గ్రహణాన్ని నిజమైన గ్రహణంగా పరిగణించరు. అయితే ఈ చంద్రగ్రహణం రోజు మాత్రం కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. అందులో మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోని జాగ్రత్త పడండి. మేషరాశి: ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మేష రాశి(Aries) వారికి సమస్యలను తెచ్చిపెడుతుంది. వృత్తి జీవితం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. మీ ప్రియమైనవారితో ఏదో ఒక విషయంలో గొడవ పడవచ్చు. ఆరోగ్యం కూడా బలహీనంగా ఉంటుంది. కర్కాటకరాశి: ఈ గ్రహణం కర్కాటక రాశి(Cancer) వారికి కూడా అశుభంగా ఉంటుంది. గ్రహణం ప్రభావం వల్ల కెరీర్‌లో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాస్‌తో ఏదో ఒక విషయం గురించి సీరియస్‌గా చర్చ జరగవచ్చు. ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. లేదంటే ఆరోగ్యం క్షీణిస్తుంది. కుంభ రాశి: కుంభ రాశి(Aquarius) వారికి కూడా ఈ చంద్ర గ్రహణం అనుకూలం కాదు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచి ఉద్యోగ ఆఫర్లు వచ్చే అవకాశం లేదు. ఈ సమయంలో మీరు మీ మాటలపై ప్రత్యేక సంయమనం పాటించాలి. బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్‌తో ఏదో విషయంలో తీవ్రమైన గొడవ జరగవచ్చు. మీన రాశి: ఈ గ్రహణం మీన రాశి(Pisces) వారికి కూడా సమస్యలను తెచ్చిపెడుతుంది. వృత్తి నుంచి ప్రేమ జీవితం వరకు సమస్యలు ఉండవచ్చు. ఏ పని చేసినా తప్పు జరగవచ్చు. కార్యాలయంలో అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. ఇది కూడా చదవండి: దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యం కోసం నోటి శుభ్రతను ఎలా పాటించాలి..? ముఖ్యగమనిక: పైన కథనం ఇంటర్‌నెట్ నుంచి తీసుకున్న సమాచారం మాత్రమే. ఇందులో చెప్పినవి నిజాలు అని చెప్పడానికి ఎలాంటి శాస్త్రియ ఆధారాలు లేవు. #astrology #lunar-eclipse #bad-impact మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి