Crime: పండగపూట విషాదం.. వాకిట్లో ముగ్గేస్తున్న టీడీపీనేత కూతుళ్లపైకి దూసుకెళ్లిన లారీ

పండగపూట ఏపీలో ఘోరం జరిగింది. ఏలూరు జిల్లా కానుకొల్లుకు చెందిన టీడీపీ నేత పంగిళ్ల నాగబాబు కూతుళ్లు వాకిట్లో ముగ్గులేస్తుండగా ఇటుకలారీ వారిపైకి దూసుకెళ్లింది. పెద్దమ్మాయి తేజస్విని అక్కడికక్కడే చనిపోగా.. చిన్నమ్మాయి పల్లవి దుర్గా చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

New Update
Crime: పండగపూట విషాదం.. వాకిట్లో ముగ్గేస్తున్న టీడీపీనేత కూతుళ్లపైకి దూసుకెళ్లిన లారీ

Crime: సంక్రాంతి పండటపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొద్దున్నే లేచి ఇంటిముందు వాకిట్లో ముగ్గులేస్తున్న వారిని ఓ లారీ (lorry) మృత్యువుల వేటాడింది. కుటుంబంతో కలిసి సంబరాలు చేసుకునేందుకు ఉత్సాహంగా పనులు చేసుకుంటున్న అక్కాచెల్లెళ్లపైకి లారీ దూసుకెళ్లింది. స్థానికులతోపాటు తెలుగు రాష్ట్రాలను కలిచివేసిన ఈ భయంకరమైన సంఘటన ఏలూరు (Elur)  జిల్లా మండవల్లి మండలం కానుకొల్లులో జరిగింది.

టీడీపీ నేత కూతుళ్లు..
ఈ మేరకు స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కానుకొల్లు గ్రామానికి చెందిన టీడీపీ (TDP) నేత పంగిళ్ల నాగబాబు (Nagababu) కూతుర్లు రోడ్డు పక్కనే ఉన్న తమ ఇంటి ముందు వాకిట్లో పొద్దున్నే లేచి సంక్రాంతి ముగ్గులు, రంగులు వేస్తున్నారు. అయితే ఉదయమే గుడివాడ నుంచి కైకలూరు వైపు వెళ్తున్న ఓ ఇటుకల లారీ అనూహ్యంగా వారిపైకి దూసుకెళ్లింది. దీంతో పెద్ద కూతురు తేజస్విని (16) (Tejaswini) అక్కడికక్కడే దుర్మరణం చెందింది. చిన్న కూతురు పల్లవీ దుర్గ (pallavi durga)కు (18) తీవ్ర గాయాలవగా స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతురాలు తేజస్విని, పల్లవీ దుర్గ ముదినేపల్లిలోని ఓ కళాశాలలో ఇంటర్‌ (inter) చదువుతున్నారు.

ఇది కూడా చదవండి : Makara Sankranti: సంక్రాంతి మనతో పాటు ఈ దేశాలు కూడా జరుపుకుంటాయి

అదుపులోకి డ్రైవర్..
ఇక ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను ప్రకాశ్‌రావుగా (prakash) గుర్తించి అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే గ్రామస్థులు, సన్నిహితులు, తెదేపా నాయకులు పెద్ద సంఖ్యలో నాగబాబు ఇంటికి చేరుకున్నారు. లారీ డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్థులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori Arrest: అఘోరీకి బిగ్ షాక్.. సంగారెడ్డి సబ్ జైలుకు తరలింపు- 14 రోజులు అక్కడే

అఘోరీకి చేవెళ్ల కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు (కంది జైలు) తరలించారు. అదే సమయంలో అఘోరీ నుంచి వర్షిణీని వేరు చేసి భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.

New Update

లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

14 రోజుల రిమాండ్

విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ వర్షిణీకి భరోసా సెంటర్ అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఇదే విషయంపై అఘోరీ తరఫు లాయర్ మాట్లాడుతూ.. ‘‘కోర్టులో ఇప్పుడు వాదోపవాదనలు ఏం జరగలేదు.  కోర్టు కేవలం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. కేసుకు సంబంధించి పూర్వపరాలు పరిశీలించి కేసు వాదించాలా లేదా అనేది జరుగుతుంది. కోర్టు తరఫున అడ్వకేట్‌ను పెట్టుకునే స్థోమత లేనివారికి కోర్టు నన్ను అపాయింట్ చేసింది. బెయిల్ గురించి ఇప్పుడే చెప్పలేం. కేసుకు సంబంధించి అన్నీ పరిశీలించిన తర్వాత ఒక టైం పడుతుంది. ’’ అని చెప్పుకొచ్చారు. 

కేసు ఏంటంటే?

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్ అఘోరీపై చీటింగ్ కేసు పెట్టింది. 6 నెలల క్రితం ప్రొద్దటూర్‌లోని ప్రగతి రిసార్ట్స్‌లో డిన్నర్‌కు వచ్చిన అఘోరి ఆమెకు పరిచయం అయ్యింది. తర్వాత తరుచుగా ఆమెకు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మహిళా ప్రొడ్యూసర్‌కు మాయ మాటలు చెప్పింది అఘోరీ .

క్షుద్ర పూజలు చేయడానికి అడ్వాస్‌గా రూ.5 లక్షలు తన అకౌంట్‌లోకి వేయించుకుంది. తర్వాత యూపీ ఉజ్జయినిలోని ఫాం హౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసింది. అప్పుడు మరో రూ.5 లక్షలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది అఘోరీ. లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరీ ఆమెను భయపెట్టింది. ఆ మాటలకు భయపడిన ఆ మహిళ మరో రూ.5 లక్షలు అఘోరీకి ముట్టజెప్పింది.

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

aghori Arrest | lady aghori arrest | Lady Aghori Sri Varshini | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment