మిస్సింగ్ మిస్టరీ.. ఐఐటీ విద్యార్థిపై లుక్అవుట్ నోటీసులు..

హైదరాబాద్‌లో  (hyderabad) చదువుతున్న ఐఐటీ విద్యార్థిపై( iit student) విశాఖలో లుక్ అవుట్ నోటీస్ జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వాటర్ ట్యాంక్ తండాకు చెందిన దనావత్ కార్తిక్ నాయక్ హైదరాబాద్ ఐఐటీలో చదువుతున్నాడు. అయితే అతడు ఎవరికీ చెప్పకుండా కాలేజీ నుంచి వెళ్లిపోయాడు. కార్తీక్ ఈనెల 17న కాలేజీ నుంచి బయటకి వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి విశాఖపట్టణం (vizag) వెళ్లాడు.

New Update

hyd iit student missing mystery

కార్తీక్ కనిపించకపోవడంతో వెంటనే తల్లిదండ్రులకి కాలేజీ సిబ్బంది సమాచారం అందించారు. సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఆరా తీశారు. అతడు విశాఖలోని బీచ్ రోడ్డులో ఉన్నట్లు సిగ్నల్స్ ద్వారా తెలంగాణ పోలీసులు గుర్తించారు. మూడు రోజుల నుంచి బీచ్ రోడ్డు (beach road)  మొత్తం గాలించినా లాభం లేకుండా పోయింది.

కార్తీక్ అక్కడే ఓ బేకరీలో ఫోన్ పే చేసి బన్ కొనుగోలు చేసినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. అతడు ఎప్పుడు ఫోన్ అన్ చేసినా సిగ్నల్స్ ట్రేస్ చేసే లోపు అక్కడ నుంచి మాయమవుతున్నట్లు చెబుతున్నారు. కుమారుడు ఆచూకీ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. అందుకే విద్యార్థి ఆచూకీ కోసం ఏకంగా లుక్‌ అవుట్ (look out notice) నోటీసులు ఇచ్చారు.

కార్తీక్ పగటి పూట అప్పుడప్పుడు మొబైల్ ఆన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. తన తండ్రి బ్యాంక్ అకౌంట్స్‌ ద్వారా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఏదైనా కావాల్సిన తిండి పదార్థాలు కొనుక్కుని బిల్ కట్టి వెంటనే ఫోన్ ఆపేస్తున్నట్లు పేర్కొన్నారు.  వెంటనే అక్కడికి వెళితే కనిపించకుండా మాయం అవుతున్నాడు. అతడి కోసం గాలింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తం మీద కార్తీక్ మిస్సింగ్ (missing) మిస్టరీగా (mystery) మారింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: ఏపీలో దారుణం.. టీడీపీ నేతను నరికి నరికి

ఒంగోలులో మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందారు.

author-image
By B Aravind
New Update

ఒంగోలులో దారుణం జరిగింది. మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. పద్మ టవర్స్‌లోని తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. ఆ తర్వాత స్థానికులు వీరయ్యను సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే లిక్కర్‌ సిండికేట్‌ విషయంలో గత కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

Also Read: ముంబై నుంచి హీరోయిన్‌ని తీసుకొచ్చి.. అరెస్టైన ఆ IPS చేసిన పని ఇదేనా..?

Advertisment
Advertisment
Advertisment