BREAKING: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై లుక్ అవుట్ నోటీసులు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ప్రస్తుతం సోహెల్ ముంబై నుంచి దుబాయికి పారిపోయినట్లు సమాచారం.

New Update
Ex MLA Shakeel: అలా చేస్తే నా కొడుకుని ఉరితీయండి.. మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

BRS EX MLA SHAKEEL: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ప్రస్తుతం సోహెల్ ముంబై నుంచి దుబాయికి పారిపోయినట్లు సమాచారం. ఈ నెల 24న అర్ధరాత్రి బేగంపేటలోని ప్రజా భవన్ వద్ద ఉన్న బారికేడ్లను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ కారుతో ఢీకొట్టాడు. మద్యం మత్తులో ఉన్న ఆయన కారులో ప్రయాణిస్తూ ఢీకొట్టగా, పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

ALSO READ: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పురుషులకు ప్రత్యేక బస్సులు?

అసలు ఏమైందంటే.. ప్రజాభవన్ వద్ద డిసెంబర్ 24న (ఆదివారం) రాత్రి అతివేగంగా వచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు భారీకేడ్లను ఢీ కొట్టింది. ఆ సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నట్లు తెలిసింది. ఆ కారు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ దని చెబుతున్నారు పోలీసులు. వీళ్లంతా స్టూడెంట్స్ అని.. కారు డ్రైవ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అని కన్ఫామ్ చేశారు పోలీస్ అధికారులు. ప్రస్తుతం సోహెల్ పరారీలో ఉండగా.. అతడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. మిగతా యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

యాక్సిడెంట్ జరిగిన తర్వాత షకీల్‌ ఇంట్లో డ్రైవర్‌గా పని వేసే వ్యక్తి.. తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడని వెల్లడించారు. షకీల్ డ్రైవర్ పోలీసుల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేశాడని.. కానీ సీసీ ఫుటేజీ ద్వారా సోహెల్‌ కారు నడిపినట్లు గుర్తించినట్లు చెప్పారు. మద్యం మత్తులో బారికేడ్లను ఢీకొట్టారని చెబుతున్నారు. సోహెల్‌పై గతంలోనూ జూబ్లీహిల్స్‌లో ఓ యాక్సిడెంట్‌ కేసు నమోదైందన్నారు. అయితే పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ నుంచి సోహెల్ తప్పించుకున్న నేపథ్యంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కావాలనే తప్పించారా అని నెటిజన్లు చర్చిస్తున్నారు.

ALSO READ: BREAKING: భారత్ లో భారీ భూకంపం!

పంజాగుట్ట ఇన్స్పెక్టర్‎పై సస్పెన్షన్ వేటు..

రాష్ డ్రైవింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే కొడుకును తప్పించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు