Khammam : మా మామను గెలిపించండి.. రాఘురాం రెడ్డికి మద్దతుగా హీరో వెంకటేష్ కూతురు!

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రాఘురాం రెడ్డికి మద్దతుగా హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత ప్రచారం నిర్వహించింది. ఖమ్మంలో కాంగ్రెస్ ఆత్మీయ సమావేశానికి హాజరై తన మామను గెలిపించాలని కోరింది. మే 7న వెంకీ కూడా ప్రచారానికి రాబోతున్నట్లు తెలుస్తోంది.

New Update
Khammam : మా మామను గెలిపించండి.. రాఘురాం రెడ్డికి మద్దతుగా హీరో వెంకటేష్ కూతురు!

Lok Sabha Elections 2024 : ఈ పార్లమెంట్ ఎన్నిక(Parliament Elections) ల్లో కాంగ్రెస్(Congress) నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న రామసహాయం రాఘురాం రెడ్డి.. గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు తన గెలుపుకోసం పలువురు ప్రముఖులు, సినీ తారలను సైతం రంగంలోకి దింపబోతున్నారు. ఈ మేరకు తన వియ్యంకుడు హీరో వెంకటేష్ సైతం రాఘురాం కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుండగా.. ఇప్పటికే వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు.

Also Read : కాంగ్రెస్ నేతలకు హైదరాబాద్ పోలీసుల షాక్.. అమిత్ షా ఫేక్ వీడియోల కేసులో ముగ్గురి అరెస్ట్!

రఘురామరెడ్డిని గెలిపించుకుందాం..
ఈ మేరకు ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న ఆమె.. కాంగ్రెస్ కండువాను కప్పుకుని పొలిటికల్ స్పీచ్ ఇచ్చారు. మే 13వ తేదీన జరగబోయే పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి, రఘురామరెడ్డిని గెలిపించుకుందామని చెప్పింది. ఇక వెంకటేష్(Venkatesh) కూతురు అశ్రితను రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి పెళ్లి చేసుకున్న సంగతి తెలసిందే. దీంతో వియ్యంకుడి గెలుపు కోసం వెంకీ రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రఘరాం రెడ్డికి వెంకటేష్ ప్రచారం కలిసొస్తుందని భావిస్తున్నారు. రఘరాం రెడ్డి మరో కుమారుడికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిడ్డను ఇచ్చారు. దీంతో రాఘురాం రెడ్డికి రెడ్డితో పాటు ఖమ్మ సామాజిక వర్గం మద్దతు లభించే అవకాశం ఉంది. వెంకటేష్ మే 7న ఖమ్మం ప్రచారం(Khammam Campaign) చేస్తారని స్థానికంగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన చేయలేదు. వియ్యంకుడు రఘురాం రెడ్డి విజయం కోసం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ కృషి చేయనున్నారు. ఇక తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుండగా.. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు