వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మధ్య జరిగిన వాగ్వాదం వీడియోలు, చాట్‌లను బీజేపీ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కళ్యాణ్ బెనర్జీ మరొ ఎంపీతో గొడవ పెట్టుకున్నారు. ఇద్దరు ఎంపీలు తిట్టుకున్న వాట్సాప్ చాట్, వీడియోలు బీజేపీ నాయకుల కంటపడింది. దీంతో సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు వీటిని విసృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మరో ఎంపీపై బూతులతో రెచ్చిపోయారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి మమతా బెనర్జీ జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. AITC MP 2024 అనే వాట్సాప్ గ్రూప్ నుండి వచ్చిన స్క్రీన్‌షాట్ ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్ అవుతున్నాయి. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నడుచుకున్న ఎంపీని కళ్యాణ్ బెనర్జీ హెచ్చరిస్తున్నారు. ఈసీకి వెళ్లే ముందు మెమోరాండంపై సంతకం చేయడానికి పార్లమెంట్ కార్యాలయంలో సమావేశమవ్వాలని పార్టీ తన ఎంపీలను ఆదేశించినట్లు కనిపిస్తోంది. మెమోరాండం తీసుకెళ్లిన ఎంపీ పార్లమెంటు సమావేశానికి రాకుండా నేరుగా ఈసీకి వెళ్లారు. దీని కారణంగా ఇద్దరు ఎంపీల మధ్య వివాదం చెలరేగింది. వీడియోలో కళ్యాణ్ బెనర్జీ ఇతర శాసనసభ్యుడిని దూషిస్తున్నాడు.