Lokesh: నన్ను కూడా అరెస్ట్ చేస్తారు.. లోకేశ్ సంచలన వ్యాఖ్యలు..! వైసీపీ విధ్వంస పాలనపై టీడీపీ-జనసేన కలిసి పోరాటం చేస్తాయని టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. టీడీపీ ఎన్డీఏలో చేరుతుందా? లేదా అనేది పార్టీ అధినేత చంద్రబాబు డిసైడ్ చేస్తారని తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతి చేశారంటూ సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు కానీ, ఏ ఒక్క సీఐడీ అధికారి అధారాలతో నిరూపించలేకపోతున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. By Jyoshna Sappogula 16 Sep 2023 in Latest News In Telugu రాజకీయాలు New Update షేర్ చేయండి Lokesh On Chandrababu Arrest: వైసీపీ విధ్వంస పాలనపై టీడీపీ-జనసేన(TDP-Janasena) కలిసి పోరాటం చేస్తాయని టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. టీడీపీ ఎన్డీఏ చేరాల లేదనేది పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) డిసైడ్ చేస్తారని తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతి చేశారంటూ సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు కానీ, ఏ ఒక్క సీఐడీ (CID) అధికారి అధారాలతో నిరూపించలేకపోతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్(Skill Development Case) కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై పోరాడుతున్నామని లోకేష్ తెలిపారు. హైకోర్టులో న్యాయం జరగపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని లోకేష్ తెలిపారు. కొన్ని సార్లు న్యాయం జరగడానికి ఆలస్యం కావొచ్చు కానీ..ఆలసమైన తప్పకుండా న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్యనించారు. తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లోనూ టీటీడీపీ పోటీ చేస్తాందని వెల్లడించారు. అధికార పార్టీ వైసీపీ రాక్షస పాలన సాగిస్తుందన్నారు టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్. త్వరలో నన్ను కూడా అరెస్ట్ చేస్తారంటూ.. వైసీపీ టీడీపీ పార్టీని భయాందోళనకు గురి చేయాలని కుట్రలు పడుతున్నారని కామెంట్స్ చేశారు. వైసీపీ దుర్మార్గపు ఆలోచనలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Janasena Chief Pawan Kalyan) కూడా బలైయ్యారని అన్నారు. జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించేందుకు వస్తున్న జనసేన అధినేత పవన్ ను పోలీసులు అడ్డుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని లోకేష్ అన్నారు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిస్తామని ధీమ వ్యక్తం చేశారు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా చోటుచేసుకున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా జరిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ములాఖత్‌తో ఒక్కసారిగా రాష్ట్రంలో పరిణామాలు మారిపోయాయి. టీడీపీ-జనసేన కలిసే వైసీపీపై పోరాటం చేస్తాయని పవన్ ప్రకటించడం పెను సంచలనంగా మారింది. ఆ తర్వాత పవన్ ప్రకటనను ఎమ్మెల్యే నందమూరి బాలయ్య, టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారాలోకేష్ స్వాగతించారు. Also Read : నేను కిందపడ్డ ప్రతిసారి వారు నన్ను.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్..!! #pawan-kalyan #nara-lokesh #lokesh #ap-politics #chandrababu-arrest #skill-development-case #ap-cid #tdp-janasena-alliance #lokesh-on-chandrababu-arrest మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి