CM Revanth Reddy: నన్ను అరెస్ట్ చేసేందుకు కుట్ర.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

TG: అమిత్‌ షాను కేసీఆర్‌ ఆవహించినట్లున్నారని అన్నారు సీఎం రేవంత్. అందుకే గాంధీ భవన్‌కు ఢిల్లీ పోలీసులను పంపి, నన్ను అరెస్ట్‌ చేయాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. ఢిల్లీ పోలీసులని కాదు.. సరిహద్దులో సైనికులను తెచ్చుకున్నా నేను భయపడను అని అన్నారు.

New Update
CM Revanth Reddy: సీఎం రేవంత్ పర్యటన.. పలువురు బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్

CM Revanth Reddy: తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాల్లో మూడు రంగుల జెండా ఎగురవేయాలని జిల్లాల పర్యటన చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు జమ్మికుంటలో జనజాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా అది వృథా అవుతుందని అన్నారు. కారు మెకానిక్ షెడ్ కు పోయిందని.. దానిని బజారులో తూకానికి అమ్మాల్సిందేనని చురకలు అంటించారు.

ALSO READ: టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీల గురించి అడిగితే తనపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అందు కొరకే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు కావాలని అంటోందని అన్నారు. అమిత్‌ షాను కేసీఆర్‌ ఆవహించినట్లున్నారని.. అందుకే ఢిల్లీ పోలీసులను గాంధీభవన్‌కు పంపించారని పేర్కొన్నారు.

తనను అరెస్టు చేయాలని అమిత్ షా పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. గుజరాత్‌ పెత్తనమా? తెలంగాణ పౌరుషమా? తేల్చుకుందాం అని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ఢిల్లీ పోలీసులని కాదు.. సరిహద్దులో సైనికులను తెచ్చుకున్నా నేను భయపడను అని అన్నారు. గుజరాత్‌ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అన్నారు. బీజేపీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని రేవంత్ ఆరోపించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు