KCR: కేసీఆర్‌కు భారీ షాక్.. ఫౌమ్ హౌజ్‌లో తనిఖీలు చేసి సీజ్ చేయాలని డీజీపీకి కంప్లైంట్! మాజీ సీఎం కేసీఆర్‌కు భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ ఫామ్ హౌస్ ను తనిఖీ చేసి సీజ్ చేయాలని తెలంగాణ డీజీపీ ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత తుమ్మేటి సమ్మిరెడ్డి. By V.J Reddy 28 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KCR: మాజీ సీఎం కేసీఆర్ కు భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ ఫామ్ హౌస్ ను తనిఖీ చేసి సీజ్ చేయాలని తెలంగాణ డీజీపీ ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత తుమ్మేటి సమ్మిరెడ్డి. ఇప్పటికే సొంత పార్టీ నేతల ఫిరాయింపులు, కూతురు కవిత అరెస్ట్ తో సతమతమవుతున్న కేసీఆర్ కు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు పోలీస్ అధికారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో కీలక విషయాలు బయటకు తీసుకొస్తున్నారు. ఈ కేసులో మాజీ మంత్రి, ఓ ఎమ్మెల్సీ హస్తం ఉన్నట్లుపోలీసులు గుర్తించినట్లు సమాచారం. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను A1 గా చేర్చాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డీజీపీని కోరిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్, హరీష్ రావు, మాజీ ఐఏఎస్ అధికారి చేతుల మీదుగా జరిగిందని.. తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని ఆయన ఆరోపించారు. తాజాగా కాంగ్రెస్ నేత తుమ్మేటి సమ్మిరెడ్డి తెలంగాణ డీజీపీకి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కేసీఆర్ ఫామ్ హౌస్ తనిఖీ చేసి.. సీజ్ చేయాలని ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత ఇచ్చిన ఫిర్యాదు సీరియస్ గా తీసుకొని కేసీఆర్ ఫామ్ హౌస్ ను అధికారులు తనిఖీ చేసి సీజ్ చేస్తారా? లేదా? అనేది వేచి చూడాలి. ఫిర్యాదులో ఏముంది? "గత ప్రభుత్వ హయాంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు అరెస్టు అయిన విషయం విదితమే. ముఖ్యంగా వీరంతా ఒకే జిల్లాకు చెందినవారు కావడం గమనార్హం. రిటైర్డ్ ఐ.పి.ఎస్. అధికారి తాను గత ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేసానని అమెరికా నుంచి రాష్ట్ర పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021లో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఉపయోగించిన ఫోన్ ట్యాపింగ్ తెరవెనుక అప్పటి మంత్రి హరీష్ రావు (ఇన్చార్జ్గా) ఎంతోమంది పోలీసు ఇంటిలిజెన్స్ అధికారులను ఉపయోగించి మాలాంటి నాయకుల ఫోన్లను ట్యాపింగ్ ద్వారా కట్టడి చేసి కోట్లాది రూపాయలు (వందల కోట్లు) దోచుకున్న విషయాలు ఇప్పుడే బయటపడుతున్నాయి. అధికారులతో నాయకులను కొని కోట్లకు డబ్బులు పంచి పెట్టి (భయభ్రాంతులకు గురి చేసిన) అధికారుల పాత్ర గురించి విచారించాలి. వెంటనే మాజీ సి.ఎం. కె.సి.ఆర్. ఫామ్ హౌజ్లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ను తక్షణమే తనిఖీ చేసి ఫామ్ హౌజ్ను సీజ్ చేయాలని కోరుతున్నాను. నాటి ముఖ్యమంత్రి కె.సి.ఆర్. రోజుల తరబడి అక్కడే ఉండి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి ప్రతిపక్షం, వ్యాపారులను బెదిరించి రాక్షసపాలనతో వారిపై అక్రమ కేసులు బనాయించారు. ఇటువంటి చర్యలు చట్టవిరుద్ధం అని తెలిసి కూడా నాటి అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వ్యాపారుల ఫోన్లు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి వందల కోట్లు దోచుకుంటే అది చట్టవిరుద్ధం కాదా? ఈ విషయంలో ప్రభుత్వం ఆయా నాయకులు, అధికారులపై లోతుగా విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మరియు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నాను. గడీలలో రాజ్యాలు ఏలిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పి కూలద్రోశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అనుమానితులు, అరెస్టు అయిన వారి ఆస్తుల చిట్టా తీసి ఎ.సి.బి, ఇడి. సంస్థలతో దర్యాప్తు చేసి దాచుకొన్న సొమ్ముపై సమగ్ర విచారణ జరగాలని కోరుతున్నాను. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోచుకున్న ఆస్తులను బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులను గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, కేటీఆర్, ఎంపీ సంతోష్ రావు తదితరుల పాత్రను కూడా లోతుగా పరిశీలించి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. తద్వారా ప్రజలకు న్యాయం చేయాలని భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలకు ఎవరూ పాల్పడకుండా నిర్ధిష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డీజీపీ గారిని కోరుతున్నాను" అని ఫిర్యాదులో పేర్కొన్నారు #kcr #brs-party #phone-tapping-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి