Harish Rao: కవితను అందుకే జైలుకు పంపారు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు బీజేపీపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని అన్నారు హరీష్ రావు. వాళ్ళతో ఒప్పందం పెట్టుకోలేదనే ఈరోజు కవితను జైలుకు పంపారని ఆరోపించారు. ఒప్పందం పెట్టుకుంటే కవిత అరెస్టు అయ్యేవారా? అని ప్రశ్నించారు. By V.J Reddy 26 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Harish Rao: సంగారెడ్డిలో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. మదక్ మీద గులాబీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు. బీజేపీ అభ్యర్థి మంచోడు అయితే దుబ్బాకలో గెలవాలి కదా అని రఘునందన్ రావును ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. పనితీరు బాగోలేదని 54 వేల ఓట్లతో ప్రభాకర్ రెడ్డిని గెలిపించారని అన్నారు. చింతా ప్రభాకర్ ను గెలిపించినట్లుగా, వెంకట్రామిరెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంతో మంచి మనిషి, పేద పిల్లల కోసం 100 కోట్లతో నిధి ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని అన్నారు. కాంగ్రెస్ పై విమర్శలు.. • రెండు లక్షల రుణమాఫీ అని మాట తప్పింది కాంగ్రెస్ • రైతు బంధు అన్ని మాట తప్పింది, బోనస్ అని మాట తప్పింది • పింఛన్లు ఇవ్వలేదు. 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. • ఏ ముఖం పెట్టుకొని ఓట్స్ అడుగుతారు • వంద రోజుల పాలన చూసి ఓటు వేయాలి అని అంటున్నారు • కాంగ్రెస్ కు ఓటు వేస్తే హామీలు అమలు చేయకున్నా ఒప్పుకున్నట్టు అవుతుంది • పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలి • చోటే భాయ్ బడే భాయ్ రేవంత్ రెడ్డి. మోడీ ఆశీర్వాదం తీసుకున్నాడు • బీజేపీ- కాంగ్రెస్ ఒక్కటే. • ముస్లిం లను క్యాబినెట్ మంత్రిగా ఏనాడూ తీసుకోలేదు కాంగ్రెస్ , కేసీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రిని చేశారు • బడ్జెట్ లో నిధులు కోత విధించారు. • రంజాన్ తోఫా కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం • బీజేపీపై బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. వాళ్ళతో ఒప్పందం పెట్టుకోలేదనే ఈరోజు కవితను జైలుకు పంపారు. • ఒప్పందం పెట్టుకుంటే కవిత అరెస్టు అయ్యేవారా • నచ్చినోళ్లు జేబులో, నచ్చ్చనోళ్లు జైల్లో ఉండాలే అన్నట్టు ఉంది బిజెపి వైఖరి. • కేజిరివాల్ ను అక్రమ కేసులు పెట్టి కేసులు అరెస్ట్ చేశారు. • ప్రతిపక్ష పార్టీలపై కేసులు పెడుతున్నారు. • కేసీఆర్ ఎప్పుడు బీజేపీతో కలిసేది లేదు.మాది సెక్యులర్ పార్టీ. • బీజేపీ, కాంగ్రెస్ రెండు కలిసి మోసం చేసాయి • 154 మెడికల్ కాలేజీలు ఇస్తే ఒక్కటి మనకు ఇవ్వలేదు. కేసీఆర్ గారు సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇచ్చారు. • రెండు పార్టీలను చిత్తూగా ఓడించాలి • రేవంత్ రెడ్డి హామీల అమలు మీద ద్రుష్టి పెట్టు. • కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారు • బీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణ నిలవాలి #cm-revanth-reddy #bjp #lok-sabha-elections #harish-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి