BRS-BSP Alliance: ఎన్నికల షెడ్యూల్.. పొత్తు రద్దు రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు రద్దు చేసుకుంటున్నట్లు బీఎస్పీ ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. By V.J Reddy 16 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BRS-BSP Alliance Cancelled: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బీఎస్పీ షాక్ ఇచ్చింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు రద్దు చేసుకుంటున్నట్లు బీఎస్పీ ప్రకటించింది. బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) రాజీనామా చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు పేర్కొంది. ఇతర పార్టీలతో కూడా పొత్తు ఉండదని తేల్చి చెప్పింది. ప్రవీణ్ రాజీనామా.. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి మాయావతికి పంపించారు. ఇటీవల రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా బీఎస్పీ కి రెండు స్థానాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్, నాగర్ కర్నూల్ రెండు ఎంపీ స్థానాల్లో బీఎస్పీ పోటీ చేయనుంది. నాగర్ కర్నూల్ నుంచి బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. తాజాగా బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మీడియా ప్రకటన తేదీ:16-03-2024 హైదరాబాద్ 👉 డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా 👉 బీఎస్పీ-బీఆర్ఎస్ మధ్య పొత్తు విఫలం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పార్టీని వీడుతున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శనివారం ప్రకటించారు. వచ్చే లోక్ సభ… — BSP4Telangana (@BSP4Telangana) March 16, 2024 Also Read: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ #kcr #rs-praveen-kumar #brs-bsp-alliance మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి