Lok Sabha Elections: బీజేపీ తొలి జాబితా విడుదల.. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. వారణాసి నుంచి ఎంపీగా మోడీ పోటీ చేయనున్నట్లు వినోద్ తావడే తెలిపారు. తెలంగాణ నుంచి 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. By V.J Reddy 02 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BJP MP Candidates First List : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. 195 మందితో తొలి జాబితా విడుదల చేశారు. తొలి జాబితాలో 34 మంది మంత్రులకు, ఇద్దరు మాజీ సీఎంలకు అవకాశం కల్పించింది బీజేపీ హైకమాండ్. ఓబీసీలకు 57, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18, మహిళలకు 28, యువతకు 47 సీట్లను మొదటి జాబితాలో ప్రకటించింది. మోడీ, అమిత్ షా ఎక్కడి నుంచంటే.. మొత్తం 16 రాష్ట్రాల్లో పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఉత్తర్ ప్రదేశ్ నుంచి 51 మంది, బెంగాల్ నుంచి 20 మంది, మధ్యప్రదేశ్ నుంచి 24 మంది, గుజరాత్ నుంచి 15 మంది, రాజస్థాన్ నుంచి 15 మంది, కేరళ నుంచి 12 మంది, తెలంగాణ నుంచి 9 మంది, అస్సాం నుంచి 11 మంది, ఝార్ఖండ్ నుంచి 11 మంది, ఛత్తీస్‌గఢ్ నుంచి 11 మంది, ఢిల్లీ నుంచి 5 మంది, జమ్మూ కాశ్మీర్ నుంచి ఇద్దరు, గోవా నుంచి ఒకరు, త్రిపుర నుంచి ఒకరు, అండమాన్ నుంచి ఒకరు పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇక మరోసారి వారణాసి (Varanasi) నుంచి ఎంపీగా ప్రధాని మోడీ (PM Modi) పోటీ చేయనున్నారు. అలాగే అమిత్ షా (Amit Shah) గాంధీ నగర్ నుంచి పోటీ చేయనున్నారు. తెలంగాణ నుంచి 9 మంది.. 1. కిషన్ రెడ్డి- సికింద్రాబాద్ 2. బండి సంజయ్ - కరీంనగర్ 3. ధర్మపురి అర్వింద్ - నిజామాబాద్ 4. బీబీ పాటిల్ - జహీరాబాద్ 5. పోతుగంటి భరత్ - నాగర్ కర్నూల్ 6. బూర నర్సయ్య గౌడ్ - భువనగిరి 7. కొండ విశ్వేశ్వర రెడ్డి - చేవెళ్ల 8. మాధవీలత - హైదరాబాద్ 9. ఈటల రాజేందర్ - మల్కాజ్‌గిరి Also Read: మేము ఎంతో కష్టపడ్డాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు #pm-modi #bandi-sanjay #lok-sabha-elections-2024 #lok-sabha-elections #varanasi #bjp-first-list #telangana-bjp-mp-list మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి