LK Advani: భారతరత్న రావడంపై స్పందించిన ఎల్‌కే అద్వానీ.. ఏమన్నారంటే

కేంద్ర ప్రభుత్వం బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రకటించడంపై ఆయన స్పందించారు. ఇది తన ఆశయాలకు , సిద్ధాంతాలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. పురస్కారాన్ని.. కృతజ్ఞతతో స్వీకరిస్తున్నానని అన్నారు.

New Update
LK Advani: భారతరత్న రావడంపై స్పందించిన ఎల్‌కే అద్వానీ.. ఏమన్నారంటే

తాజాగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఎల్‌కే అద్వానీ స్పందించారు. ఇది తన ఆశయాలకు , సిద్ధాంతాలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ భారతరత్న పురస్కారాన్ని.. కృతజ్ఞతతో స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు. ఇది కేవలం నాకు మాత్రమే దక్కిన గౌరవం కాదని.. జీవితాంతం సేవ చేసేందుకు నేను నమ్ముకున్న సిద్ధాంతాలు, ఆశయాలకు దక్కిన గౌరవమన్నారు.

Also Read: చంద్రబాబు విలన్ .. సిద్ధం సభలో రెచ్చిపోయిన సీఎం జగన్

14 ఏళ్లున్నప్పుడు వాలంటీర్‌గా చేరా

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఇలాంటి శుభ సమయంలో వెన్నుదన్నుగా కుటుంబ సభ్యలు, లోకం నుంచి వెళ్లిపోయిన భార్య కమలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వాళ్ల సహకారంతోనే ప్రజలకు సేవ చేయలగలిగానని.. వాళ్లే తమ బలమని చెప్పారు. 14 ఏళ్ల వయసున్నప్పుడు ఆర్‌ఎస్ఎస్‌లో వాలంటీర్‌గా చేరినప్పటి నుంచి.. తన స్వలాభం కోసం ఎప్పుడూ కూడా ఆలోచించలేదని.. నిస్వార్థంగా దేశం కోసమే పనిచేశానన్నారు.

వారికి కృతజ్ఞతలు

ఈ సందర్భంగా భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయ్, పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాతో కలిసి పనిచేసినప్పటి రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు. తనకు ఇలాంటి గౌరవం లభించడంలో ముఖ్యపాత్ర పోషించిన పార్టీ నాయకులు, సంఘ్‌ కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. ఇదిలా ఉండగా.. ఎల్‌కే అద్వానికి భారతరత్నతో గౌరవిస్తున్నామని.. ప్రధాని మోదీ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో తెలిపారు.

Also Read: తొమ్మిదొవ తరగతి పుస్తకంలో డేటింగ్, రిలేషన్‌షిప్స్‌ పాఠాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు