Bath Tips: ఈ సమస్యలున్నాయా? అయితే వేడి నీళ్లతో స్నానం చేయవద్దు!

కాలేయం, జీర్ణ సమస్యలు ఉన్నవారు వేడి నీళ్లకు దూరంగా ఉండాలి. వీరు చల్లటి నీళ్లతో తలస్నానం చేస్తే మంచిది. వేడి నీళ్లతో స్నానం చేస్తే అపానవాయువు, అజీర్ణం వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది కడుపుని వేడి, ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియను నెమ్మదింప చేస్తుందని వైద్యులు అంటున్నారు.

New Update
Bath Tips: ఈ సమస్యలున్నాయా? అయితే వేడి నీళ్లతో స్నానం చేయవద్దు!

Bath Tips: నీళ్ళతో తడిపి,నీళ్ళలో మునిగి శుభ్రపరచుకోవటాన్ని స్నానం అంటారు. ప్రతిరోజూ చేసే స్నానానికి పాలు, నూనె, తేనె వంటి ద్రవపదార్ధాలను ఉపయోగిస్తారు. మన శరీరం శుభ్రంగా ఉండాలన్న, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్న రోజూ స్నానం చేయాలి. చలికాలంలో స్నానం అంటేనే చలికి బయపడుతారు. ఈకాలంలో వేడి నీళ్లలో స్నానం చేస్తారు.అయితే.. ఏడాది పొడవునా వేడినీటితో స్నానం చేసేవారుంటారు. వేడి నీళ్లలో స్నానం చేయడం శరీరానికి మంచిదా..? దీని వల్ల ఏవైనా సమస్యలు వస్తాయా..? అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. ఆ విషయాల గురించి నిపుణులు ఏమంటున్నారో..? ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

వేడి నీళ్లలో స్నానం చేస్తే:

  • శీతాకాలంలో వేడి నీళ్లలో స్నానం చేస్తే లాభాలతో పాటు నష్టాలున్నాయి. శీతాకాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వేడి నీళ్లతో స్నానం చేయవచ్చు.
  • నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కానీ.. వేడి నీటి స్నానం అందరికీ మంచిది కాదంటున్నారు. ఎగ్జిమా, సొరియాసిస్ వంటి చర్మ సమస్యలు ఉన్నవారు వేడి నీళ్లతో స్నానం చేయకూడదని చెబుతున్నారు.
  • కాలేయం, జీర్ణ సమస్యలు ఉన్నవారు వేడి నీళ్లకు దూరంగా ఉండాలి. ఈ సమస్యలున్న వారు చల్లటి నీళ్లతో తలస్నానం చేస్తే మంచిది. వేడి నీళ్లతో స్నానం చేస్తే అపానవాయువు, అజీర్ణం వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది కడుపుని వేడి, ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియను నెమ్మదింప చేస్తుందని వైద్యులు అంటున్నారు.
  • వేడి నీళ్లతో స్నానం చేస్తే రాత్రి నిద్ర బాగా పడుతుంది. వేడి నీళ్లలో స్నానం చేయడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. వేడి నీటిలో స్నానం చేయడం గుండెకు కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: పొటాటో ఫింగర్స్ ను ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ

మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ 11 పరుగులు తేడాతో విజయం సాధించింది. 

New Update
ipl

RCB VS RR

ఐపీఎల్ లో ఈ రోజు ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగులు చేసి ఆర్ఆర్ కు 206 టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులే చేసింది.  పరుగుల ఛేదనలో ఆర్ఆర్ తొమ్మిది వికెట్లను కోల్పోయింది. యశస్వీ జైస్వాల్‌ (49), ధ్రువ్‌ జురెల్‌ (47) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్ష్యం 17 పరుగులు కాగా, యశ్‌ దయల్‌ వికెట్‌ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. ఆర్సీబీలో హేజిల్‌ వుడ్‌ 4, కృనాల్‌ పాండ్య 2, భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | rcb-vs-rr | match

Advertisment
Advertisment
Advertisment