CM Kejriwal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. మరో 4 రోజుల కస్టడీ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. మరో 4 రోజులు ఈడీ కస్టడీకి అనుమతించింది. By V.J Reddy 28 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి CM Kejriwal Custody Extended: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. మరో నాలుగు రోజులు ఈడీ కస్టడీకి అనుమతించింది. కాగా లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ను విచారించేందుకు మరో 7 రోజుల కస్టడీ కావాలని కోర్టు ఈడీ కోరగా.. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈడీ కస్టడీకి ఓకే చెప్పింది. #BREAKING | Delhi CM Arvind Kejriwal's ED Custody Extended By 4 Days Till April 1 In Liquor Policy Case | @nupur_0111 #ArvindKejriwal #LiquorPolicyScam https://t.co/yKF6LLXpVN — Live Law (@LiveLawIndia) March 28, 2024 వాదనలు ఇలా నడిచాయి.. * కేజ్రీవాల్: రెండేళ్ల క్రితం నుంచి ఈ కేసు నడుస్తోంది. 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదైంది. అప్పుడు ECIR ఫైల్ సృష్టించబడింది. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ కోర్టు నన్ను దోషిగా గుర్తించలేదు లేదా నాపై ఆరోపణలు చేయలేదు. ED దాదాపు 25,000 పేజీలను దాఖలు చేసింది. చాలా మంది సాక్షులను విచారించింది. * జడ్జి: ఇవన్నీ రాతపూర్వకంగా ఇవ్వగలరా? రికార్డు తీసుకుందాం. * కేజ్రీవాల్: నన్ను మాట్లాడనివ్వండి. * కేజ్రీవాల్: నా ఇంటికి చాలా మంది మంత్రులు వస్తుంటారు.. ఎదో పని పై ఏవో డాక్యుమెంట్స్ గుసగుసలు పెట్టి ఇస్తుంటారు.. ఇలాంటి అధరాలు సరిపోయా ఒక సిట్టింగ్ సీఎంను అరెస్ట్ చేయడానికి? అని కోర్టు ప్రశ్నించారు. * కేజ్రీవాల్: ఈడీ అధికారులు నాకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌లు ఇచ్చే వరకు స్టేట్‌మెంట్‌ల మీద స్టేట్‌మెంట్‌లు తీసుకుంటారు. దీని అర్థం నన్ను ట్రాప్ చేయడమే వారి ఉద్దేశం. * కేజ్రీవాల్: రాఘవ్ మాగుంట ఇచ్చిన 7 స్టేట్మెంట్స్, అతని తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ లో నా పేరు లేదు. * కేజ్రీవాల్: నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, సిట్టింగ్ సీఎంను అరెస్టు చేయడానికి ఈ 4 స్టేట్మెంట్స్ సరిపోతాయా?. ఈడీ ఫైల్‌లో ఉన్న లక్ష పేజీలు మాకు అనుకూలంగా రికార్డుల్లోకి తీసుకురాలేదు. * కేజ్రీవాల్: మద్యం కుంభకోణం నుండి వచ్చిన డబ్బు ఎక్కడికి పోయాయి? * కేజ్రీవాల్: సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ, ” ఈ స్కాం లో రూ. 100 కోట్లు ఈడీ అధికారులు కోట్ చేస్తున్నారు.. మరి ఆ 100 కోట్లు ఏమైయ్యాయి. ఈడీ విచారణ తర్వాత అసలు మద్యం కుంభకోణం ప్రారంభమైంది.” * కేజ్రీవాల్: ఇది కేవలం దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేయడమే ED ఉద్దేశం * ఈడీ: కేజ్రీవాల్ దర్యాప్తు సంస్థపై ఆరోపణలు చేస్తున్నారని ED తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. * కేజ్రీవాల్: లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యాక శరత్ రెడ్డి బీజేపీకి 50 కోట్లు డొనేట్ చేశారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. * కేజ్రీవాల్: నేను రిమాండ్ విచారణను వద్దు అనడం లేదు.. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఈ కేసులో నన్ను విచారించడండి. * ఈడీ: లిక్కర్ స్కాం కేసులో మరింత పురోగతి కావాలంటే కేజ్రీవాల్ మరో 7 రోజుల కస్టడీ కావాలి.. గోవాకు చెందిన ఆప్ నేతలతో కలిపి విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. కేజ్రీవాల్ ను ఏడు రోజల కస్టడీ ఇవ్వాలని కోర్టు కోరుతున్నాం. * జడ్జి: ఇద్దరి న్యాయవాదుల తరఫున వాదనలు విన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. మరి కాసేపట్లో తీర్పును వెల్లడించనుంది. #aravind-kejriwal #delhi-liquor-scam-case #kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి