Rajaadhani Files : రాజధాని ఫైల్స్‌కు లైన్‌ క్లియర్!

'రాజధాని ఫైల్స్' సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్‌లు, రికార్డ్‌లు సక్రమంగానే ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది.

New Update
Rajaadhani Files : రాజధాని ఫైల్స్‌కు లైన్‌ క్లియర్!

Raajadhani Files Movie : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో పొలిటికల్ హీట్ పెరుగుతుండటంతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పలు సినిమాలు రూపొందుతున్నాయి. ఈ వివాదాస్పద చిత్రాల్లో ఒకటైన 'రాజధాని ఫైల్స్'(Raajadhani Files) అమరావతి(Amaravati) రాజధాని అంశంపై జరుగుతున్న పరిణామాల గురించి రూపొందించిన సినిమా. ఈ చిత్రం రాష్ట్రంలోని ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ(YCP) కి అనుకూలంగా లేకపోవడంతో నిన్న సినిమా విడుదలను నిలిపివేయాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. కానీ కాసేపటికే కోర్టు సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇచ్చింది.

ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి(Lella Appi Reddy) దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. నిన్న చాలా ఏరియాల్లో స్క్రీనింగ్స్ జరుగుతుండగానే సినిమా విడుదలను మధ్యలోనే నిలిపివేశారు.

అయితే ఎట్టకేలకు ఈ సినిమాను నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించేందుకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే సెన్సార్ బోర్డు(Sensor Board) సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించడం ద్వారా సమస్యలను పరిష్కరించిందని, ఆ తర్వాత రివ్యూ కమిటీ సర్టిఫికేట్ ను తిరిగి జారీ చేసిందని చిత్ర నిర్మాతల న్యాయ సలహాదారు వాదించారు. ఇప్పుడు తుది నిర్ణయం వెలువడింది మరి దీనిపై అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read : మరీ ఇంత క్రూరమా? కోట్లకు కోట్లు కట్నం తీని కూడా హింస పెట్టి చంపేశారు!

Advertisment
Advertisment
తాజా కథనాలు