World TB Day 2025: ప్రమాదకరమైన అంటూ వ్యాధి.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతీ సంవత్సరం మార్చి 24న ప్రపంచ TB దినోత్సవం జరుపుకుంటారు. టిబి అనేది ఒక ప్రమాదకరమైన ఊపిరితిత్తుల వ్యాధి. దీని కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

New Update
World TB Day  2025

World TB Day 2025

World TB Day 2025: TB అనేది మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఒక తీవ్రమైన అంటూ వ్యాధి. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే ప్రాణాలకే ప్రమాదం. దీని కారణంగా ప్రతీ ఏడాది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 28న ప్రపంచ TB దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు, నివారణ మార్గాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.. 

TB లక్షణాలు

  • 2 వారాల కంటే ఎక్కువ కాలం నిరంతర దగ్గు
  • బరువు తగ్గడం
  • ఆకలి లేకపోవడం
  • కఫంలో రక్తం
  • రాత్రిపూట చెమటలు పట్టడం
  • అధిక జ్వరం,  చలి.. ఈ లక్షణాలు తరచూ కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. 

TB నివారణ మార్గాలు.. 

BCG వ్యాక్సిన్ 

పిల్లలను TB నుంచి రక్షించడానికి  వారికి చిన్నవయసులో BCG (Bacillus Calmette-Guérin)  వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి. 

దూరంగా ఉండాలి 

TB అనేది ఒక అంటురోగం కావున.. ఇది సోకిన వ్యక్తులకు నుంచి దూరం పాటించాలి. రోగికి దగ్గరగా ఉండడం ద్వారా వారిలోని బాక్టీరియా గాలి ద్వారా ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది. 

రోగనిరోధక శక్తి

రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి కూడా టీబీ త్వరగా సోకే ప్రమాదం ఉంది. అందువల్ల  పౌషికరమైన ఆహారం తీసుకోవడం,  ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం చాలా ముఖ్యమైనది. 

మార్చి 24న ఎందుకు.. 

టీబీ దినోత్వాన్ని మార్చి 24న మాత్రమే జరుపుకోవడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. డాక్టర్ రాబర్ట్ కోచ్ టిబికి కారణమయ్యే మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ బ్యాక్టీరియాను  1882 మార్చి 24న కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ టీబీ చికిత్సకు ఒక మార్గాన్ని తెరిచింది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది మార్చి 24న 'World TB Day' జరుపుకోవాలని నిర్ణయించారు. 

latest-news | World TB Day 2025 | life-style | health 

Also Read: Varun Tej VT15: రూట్ మార్చిన మెగా హీరో.. ఇండో- కొరియన్ హర్రర్ కామెడీకి ముహూర్తం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు